తమిళ స్టార్ హీరో కమల్ హాసన్ ,విజయ్ సేతుపతి, మలయాళ నటుడు ఫాహద్ పజిల్ ప్రధాన పాత్రలో కమల్ హాసన్ సొంత బ్యానర్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం విక్రమ్. సుమారు 3 సంవత్సరాల నుంచి కమల్ హాసన్ వెండితెరపై ప్రేక్షకులను సందడి చేయలేదు.ఈ క్రమంలోనే ఎన్నో భారీ అంచనాల నడుమ ఈ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
ఇక ఈ సినిమాలో ఈ ముగ్గురు నటుల నటన అమోఘం అని చెప్పాలి. ఇకపోతే ఈ సినిమాలో హీరో సూర్య అతిధి పాత్ర ద్వారా ప్రేక్షకులను మెప్పించారు.చాలా సంవత్సరాల తర్వాత కమల్ హాసన్ నటించిన ఈ సినిమా మంచి విజయం సొంతం చేసుకుంది.ఇక పోతే ఈ సినిమాలో నటించినందుకు నటులు ఎంతవరకు రెమ్యూనరేషన్ తీసుకున్నారనే విషయం గురించి ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
సినీ ఇండస్ట్రీలో వస్తున్న సమాచారం ప్రకారం ఈ సినిమా దాదాపు 120 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కినట్లు సమాచారం. ఇక ఈ సినిమా కోసం డైరెక్టర్ లోకేష్ 8 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకోగా మలయాళ నటుడు ఫాహద్ పజిల్ నాలుగు కోట్ల రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు తెలుస్తోంది.ఇకపోతే కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి ఈ సినిమా కోసం పది కోట్ల పారితోషికం తీసుకున్నారు.
ఇక ఈ సినిమాలో ప్రధానపాత్రలో నటించిన కమల్ హాసన్ ఏకంగా 50 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ తీసుకున్నారట. ఇక ఎప్పటిలాగే తన సంగీతంతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ రవిచంద్రన్ విక్రమ్ సినిమా కోసం నాలుగు కోట్ల పారితోషికం తీసుకున్నట్లు తెలుస్తోంది. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లను రాబడుతోంది. ఇకపోతే తెలుగులో ఈ సినిమాని నితిన్ తన సొంత బ్యానర్ లో విడుదల చేశారు.
Most Recommended Video
విక్రమ్ సినిమా రివ్యూ & రేటింగ్!/a>
వెంకీ టు నితిన్… ఛాలెంజింగ్ పాత్రలు చేసిన 10 మంది హీరోల లిస్ట్
ప్రభాస్ టు నాని… నాన్ థియేట్రికల్ రైట్స్ రూపంలో భారీగా కలెక్ట్ చేసే హీరోలు..!