Kamal Haasn: ‘విశ్వరూపం’ షూటింగ్‌ సమయంలో పోలీసులు వచ్చి!

కమల్‌ హాసన్‌ కెరీర్‌లో ది బెస్ట్‌ అనిపించుకునే సినిమాల్లో ఒకటి ‘భారతీయుడు’. అలాగే కమల్‌ సినిమాల్లో ప్రేక్షకులు మరచిపోలేని సినిమాల్లో ‘విశ్వరూపం’ ఒకటి. లంచం, అవినీతి నేపథ్యంలో సాగిన ఈ సినిమాను చూడటానికి జాతరకు వచ్చినట్లు ప్రేక్షకులు వచ్చేవారని చెబుతుంటారు. ఆ సినిమా చూడని వారుండరు కాబట్టి… ఆ సినిమా అందరికీ గుర్తుండే ఉంటుంది. మనకు ఎంత గుర్తుంటుందో తెలియదు కానీ… ఓ సీన్‌ మాత్రం కమల్‌ హాసన్‌ను ఇంకా గుర్తుండి ఉంటుంది. ఎందుకంటే ఆ రోజు జరిగిన విషయం అలాంటిది.

సినిమా షూటింగ్‌ కోసం ‘విశ్వరూపం’ బృందం అమెరికా వెళ్లిందట. బ్రూక్లిన్‌ బ్రిడ్జ్‌ మీద సీరియస్‌గా షూటింగ్‌ పనులు చూసుకుంటున్నారట. కమల్‌ హాసన్‌ ఆ రోడ్డు మీద అటు ఇటు తిరుగుతున్నారట. ఏమైందో ఏమో అక్కడికి హెలికాప్టర్లు వచ్చాయట. ఇదేదో బాగుందే సీన్‌ తీద్దాం అనుకున్నారట. తర్వాత తెలిసింది ఆ హెలీకాప్టర్‌ వచ్చింది వారికోసమని, అందులో పోలీసులు ఉన్నారని, ఆ విషయం తెలిసి ఆశ్చర్యపోతున్న సమయంలో వెనుక నుండి ఓ పోలీసు వచ్చారట.

ఏం చేస్తున్నారు ఇక్కడ అని ఆ పోలీసు కమల్‌ను పట్టుకున్నారట. కమల్‌ వెంటనే షూటింగ్‌ అన్నారట. అటువైపు చూస్తే ఓ గన్ను మీద క్లాత్‌ కప్పినట్లు ఉందట. దీంతో ఫైరింగ్‌ ఏమో అనుకొని పోలీసు దగ్గరకు వచ్చారట. కెమెరా లెన్స్‌పై క్లాత్‌ కప్పి ఉంచటంతో దానిని గన్‌ అనుకున్నారట పోలీసు. దీంతో పోలీసు ఆ క్లాత్‌ కోపంగా తీశారట. చూస్తే అక్కడ ఉన్నది కెమెరా. దీంతో పోలీసు ముఖంలో కాస్త ప్రశాంతత కనిపించదట. అప్పటికే బయటకు తీసిన గన్‌ను బటన్‌లో పెట్టేశారట.

ఈలోపు మరో నటుడు రాహుల్‌ బోస్‌ వచ్చి… ‘ఆఫీసర్‌ మా ఫ్లైట్‌కి టైమ్‌ అవుతోంది’ అని అన్నారట. మరోసారి పోలీసు ముఖంలో కోపం కనిపించిందట. కానీ ఏమైందో ఏమో కూల్‌గా ఓకే క్యారీ ఆన్‌ అంటూ… వెళ్లిపోయారట. దీంతో షూటింగ్‌ పూర్తి చేసుకొని వచ్చేశాం అని నాటి రోజుల్ని గుర్తు చేసుకున్నారు కమల్‌ హాసన్‌.

మేజర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

విక్రమ్ సినిమా రివ్యూ & రేటింగ్!
వెంకీ టు నితిన్… ఛాలెంజింగ్ పాత్రలు చేసిన 10 మంది హీరోల లిస్ట్
ప్రభాస్ టు నాని… నాన్ థియేట్రికల్ రైట్స్ రూపంలో భారీగా కలెక్ట్ చేసే హీరోలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus