కమల హాసన్ విశ్వనటుడు. విలక్షణ నటుడు. ఒక సినిమాలో ఒకటి, రెండు, మూడు, నాలుగు పాత్రలు కాదు, 10 విభిన్న పాత్రలు పోషించగల నటుడు. బలపం పట్టి అ.. ఆ లు దిద్దే సమయంలోనే నటనలో ఓనమాలు నేర్చుకున్నారు. కళామతల్లి ఒడిలో ఇప్పటికీ విద్యార్థిగా నేర్చుకుంటూనే ఉన్నారు. నటనే శ్వాసగా బతికే కమల్ హాసన్ నేడు(నవంబర్ 7) పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయన రియల్, రీల్ లైఫ్ లో దాగున్న సీక్రెట్స్…
1. పార్ధ సారధితమిళనాడుకు చెందిన లాయర్ శ్రీనివాసన్, రాజ్యలక్ష్మి దంపతులకు కమల హాసన్ 1954 నవంబర్ 7 న జన్మించారు. సినిమాల్లోకి అడుగు పెట్టక పూర్వం ఆయన పేరు పార్థసారధి.
2. బాల కమల్కమల హాసన్ నాలుగేళ్ల వయసులోనే భారత రాష్ట్రపతి నుంచి ఉత్తమ బాల నటుడు అవార్డు అందుకున్నారు. కలతూర్ కన్నమ్మ లో కమల్ హాసన్ చేసిన నటనకు ఈ అవార్డు సొంతం చేసుకున్నారు.
3. గురువు బాల చందర్బడికి వెళ్తూనే కమల్ హాసన్ స్థానిక డ్రామా కంపెనీల్లో నాటకాలు వేశారు. అలాగే చాలా సినిమాల్లో చిన్న పాత్రలు పోషించారు. తొలి సారిగా హీరో అవకాశం ఇచ్చింది దర్శకుడు కె.బాల చందర్. ఆయన దర్శకత్వంలో వచ్చిన అపూర్వ రాగంగళ్ సినిమాలో కమల్ కథానాయకుడిగా నటించి పేరు తెచ్చుకున్నారు. ఆయన్నే కమల్ గురువుగా భావిస్తారు.
4. మూడు మలుపులుకమల్ హాసన్ నిజ జీవితంలో మూడు సార్లు ప్రేమలో పడ్డారు. కెరీర్ తొలి నాళ్లలో డ్యాన్సర్ వాణి గణపతి ని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. పదేళ్లు కాపురం చేసిన తర్వాత సహ నటి సారికను వివాహం చేసుకున్నారు. ఆమె తో విడాకులు తీసుకున్న తర్వాత గౌతమితో 13 ఏళ్ళ పాటు సహజీవనం చేశారు.
5. మనసున్న మనిషితమిళనాడు ప్రభుత్వం 2010లో చేపట్టిన హృదయరాగం ప్రాజెక్ట్ కి కమల్ బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించారు. విరాళాలను సేకరించి హెచ్ ఐ వి బాధిత చిన్నారులకు అందజేశారు.
6. అవార్డుల వరదకమల్ హాసన్ కి వచ్చిన అవార్డుల గురించి రాస్తే ఒక పుస్తకం అవుతుంది. అన్ని అవార్డులు తీసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన పురస్కారాలతో పాటు ఇప్పటివరకు 19 ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ అందుకున్నారు. కేంద్రం పద్మశ్రీ, పద్మభూషణ్ అందించి గౌరవించింది.
7. మాతృభాషలో వ్యాసాలుకమల్ అనేక చిత్రాలకు కథలు రాసారు. స్క్రిప్ట్ ని కూడా రాసారు. అయితే ఎవరికీ తెలియనై విషయం ఏమిటంటే తమిళ సాహిత్యాన్ని పెంపొందించడానికి కృషి చేశారు. వివిధ తమిళ పత్రికల్లో అనేక వ్యాసాలు రాశారు.
8. సినిమాకే అంకితండబ్బులు కోసం కమల్ చిత్రాలను నిర్మించలేదు. అత్యంత సాహోసపేతమైన కథలని స్వయంగా రాజ్ కమల్ ఇంటర్నేషనల్ సంస్థ ద్వారా నిర్మించారు.
9. పేరులోనే వివాదంసినీ పరిశ్రమలో అనేక కొత్త విధాలను స్వాగతించి వివాదాల్లోకి ఇరుక్కున్న కమల హాసన్.. ఆ పేరులోనే వివాదాన్ని నింపుకున్నారు. ఆ పేరు చూసి ఇతర దేశాల వారు ముస్లిం గా పొరబడ్డారు. కమల్ అంటే పువ్వు అని హాసన్ అంటే హాస్య(నవ్వు) అని పలు మార్లు వివరణ ఇచ్చుకున్నారు.
10. నిగర్విఎన్ని విజయాలను సొంతం చేసుకున్నా, బోలెడు అవార్డులను కైవసం చేసుకున్నా కమల్ నిగర్విగా కీర్తిపొందారు. ఈ పేరు, ప్రతిష్టలంతా దేవుడు దయ వలన వచ్చిందని కమల్ సింపుల్ గా చెబుతుంటారు.