శేఖర్ కమ్ముల తన సినీ కెరీర్ లో తెరకెక్కించిన సినిమాలు తక్కువే అయినా ఆ సినిమాలతో దర్శకునిగా మంచిపేరు తెచ్చుకున్నారు. సుమంత్, కమిలినీ ముఖర్జీ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన గోదావరి సినిమా బాక్సాఫీస్ దగ్గర హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో నటుడు కమల్ కామరాజు కీలక పాత్రలో నటించారు. గోదావరి సినిమా విడుదలై 15 సంవత్సరాలు అయిన సందర్భంగా కమల్ కామరాజు కీలక విషయాలను చెప్పుకొచ్చారు.
శేఖర్ కమ్ముల ఆఫీస్ రాయల్ ఆర్కోట్ లోని ఫస్ట్ ఫ్లోర్ లో ఉండేదని తాను అక్కడికి వెళ్లగా కో డైరెక్టర్ ప్రవీణ గోదావరి సినిమా కాస్టింగ్ అయిపోయిందని చెప్పి పంపించేశారని కమల్ కామరాజు అన్నారు. ఆ తరువాత ప్రవీణ శేఖర్ కమ్ముల తనను చూడాలని అనుకుంటున్నారని కాల్ చేశారని తనను అడిషన్ చేసి సెలక్ట్ అయినట్టు మాత్రం చెప్పలేదని కమల్ కామరాజు పేర్కొన్నారు. కొన్ని వారాల తర్వాత మళ్లీ కాల్ రావడంతో గోదావరి షూటింగ్ కోసం రాజమండ్రి వెళ్లానని కమల్ కామరాజు వెల్లడించారు.
శేఖర్ కమ్ముల చివరి నిమిషం వరకు అనుకున్న పాత్ర కోసం వెతుకుతారని ఇప్పటికీ ఆయన అదే ఫాలో అవుతారని కమల్ కామరాజు అన్నారు. తన తొలి షాట్ కోసం 37 టేక్స్ తీసుకున్నానని కమల్ కామరాజు చెప్పుకొచ్చారు. శేఖర్ కమ్ముల సహనంతో షాట్ పూర్తి చేశారని కమల్ కామరాజు తెలిపారు. శేఖర్ కమ్ముల 37 టేక్స్ తర్వాత షాట్ ఓకే చేశారని తెలిసి కొందరు నెటిజన్లు సరదాగా శేఖర్ కమ్ముల నటులను అంత టార్చర్ చేస్తారా..? అని కామెంట్లు చేస్తున్నారు. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన లవ్ స్టోరీ సినిమా త్వరలో రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే.
Most Recommended Video
టాలీవుడ్ స్టార్ హీరోల ఫేవరెట్ ఫుడ్స్ ఇవే..?
ఈ 10 సినిమాల్లో కనిపించని పాత్రలను గమనించారా?
2020 లో పాజిటివ్ టాక్ వచ్చినా బ్రేక్ ఈవెన్ కానీ సినిమాల లిస్ట్..!