రాఘవ లారెన్స్ హీరోగా 2007 లో ‘ముని’ అనే సినిమా వచ్చింది. అది బాగానే ఆడింది కానీ ఆశించిన స్థాయిలో గుర్తింపు రాలేదు. కొంత గ్యాప్ తర్వాత అంటే 2011 లో దాని సీక్వెల్ గా ‘కాంచన’ సినిమా వచ్చింది. పెద్దగా చప్పుడు చేయకుండా జూలై 15న రిలీజ్ అయిన ఈ సినిమా.. సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. శరత్ కుమార్ చేసిన హిజ్రా రోల్ సినిమాకి హైలెట్ అయ్యింది అని చెప్పాలి.
అలాగే హర్రర్ కామెడీ సినిమాలకి ఊపు ఇచ్చింది ఈ సినిమా. నేటితో ఈ సినిమా రిలీజ్ అయ్యి 14 ఏళ్ళు పూర్తి కావస్తోంది. ఈ సందర్భంగా ఒకసారి క్లోజింగ్ కలెక్షన్స్ ను ఓ లుక్కేద్దాం రండి :
నైజాం | 9.2 cr |
సీడెడ్ | 2.5 cr |
ఉత్తరాంధ్ర | 2.8 cr |
ఈస్ట్ | 1.25 cr |
వెస్ట్ | 1.06 cr |
గుంటూరు | 2.13 cr |
కృష్ణా | 1.85 cr |
నెల్లూరు | 0.85 cr |
ఏపీ+తెలంగాణ | 21.64 cr |
‘కాంచన’ సినిమా రూ.9 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగింది. తెలుగు రాష్ట్రాల్లో ఫుల్ రన్లో ఈ సినిమా ఏకంగా రూ.21.64 కోట్ల షేర్ ను రాబట్టింది. గ్రాస్ పరంగా రూ.40 కోట్ల వరకు కొల్లగొట్టింది అని చెప్పాలి. బయ్యర్స్ కి 12.64 కోట్ల లాభాలు అందించి డబుల్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది ‘కాంచన’.