రామ్, హన్సిక కాంబినేషన్లో ‘మస్కా’ వంటి డీసెంట్ హిట్ తర్వాత రూపొందిన చిత్రం ‘కందిరీగ’. ‘ఖతర్నాక్’ ‘రెయిన్ బో’ వంటి సినిమాలకు సినిమాటోగ్రాఫర్ గా పనిచేసిన సంతోష్ శ్రీనివాస్ ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయమయ్యాడు. సోనూసూద్, అక్ష కూడా ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించగా.. ఇప్పటి సక్సెస్ ఫుల్ దర్శకుడు అనిల్ రావిపూడి ‘కందిరీగ’ కి రైటర్ గా పనిచేయడం విశేషంగా చెప్పుకోవాలి. బెల్లంకొండ సురేష్ నిర్మించిన ఈ సినిమా 2011 ఆగస్టు 12న రిలీజ్ అయ్యింది.
పెద్దగా అంచనాలు లేకుండా వచ్చిన ఈ సినిమా మంచి కమర్షియల్ సక్సెస్ అందుకుని.. ‘రామ రామ కృష్ణ కృష్ణ’ ‘గణేష్’ వంటి ప్లాప్ లతో సతమతమవుతున్న రామ్ ని తిరిగి హిట్ ట్రాక్ ఎక్కించింది. ఈరోజుతో 14 ఏళ్ళు పూర్తి చేసుకుంటున్న ‘కందిరీగ’ బాక్సాఫీస్ కలెక్షన్స్ ను ఓ లుక్కేద్దాం రండి :
నైజాం | 6.42 cr |
సీడెడ్ | 2.97 cr |
ఉత్తరాంధ్ర | 1.42 cr |
ఈస్ట్ | 1.03 cr |
వెస్ట్ | 0.98 cr |
గుంటూరు | 1.35 cr |
కృష్ణా | 1.12 cr |
నెల్లూరు | 0.57 cr |
ఏపీ+తెలంగాణ | 15.86 cr |
రెస్ట్ ఆఫ్ ఇండియా | 1.77 cr |
ఓవర్సీస్ | 0.61 cr |
వరల్డ్ టోటల్ | 18.24 cr (షేర్) |