Kangana, Rajamouli: కంగన రనౌత్‌తో రాజమౌళి సినిమా?

‘నా సినిమాలో మీరు నటిస్తారా?’ అని ఎవరైనా అడగాలి తప్పా.. ‘మీ సినిమాలో నాకు అవకాశం ఇస్తారా?’ అని నేను అడగను అనే రకం ప్రముఖ బాలీవుడ్‌ కథానాయిక కంగనా రనౌత్‌. కెరీర్‌ ప్రారంభంలో ఎలా ఉందో తెలియదు కానీ, సరైన హిట్‌లు రెండు పడ్డాక ఇలా మారిపోయింది. తాజాగా మరోసారి తన మనసులో మాట బయటపెట్టింది కంగనా రనౌత్‌. ప్రముఖ దర్శకుడు రాజమౌళితో పనిచేయాలని ఉంది అని చెబతూనే.. ఓ మెలిక పెట్టింది కంగన.

Click Here To Watch Trailer

రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్‌ తన సినిమాలకు కథలు అందిస్తున్నారనో లేక రాజమౌళి సినిమాల పనితనం నచ్చో తెలియదు కానీ… కంగనా రనౌత్‌కు రాజమౌళి అంటే బాగా అభిమానం. మొన్నీ మధ్య ‘ఆర్ఆర్ఆర్‌’ సినిమా విడుదలైనప్పుడు కనీసం ఆ సినిమా చూడకుండానే తెగ పొగిడేసింది. ఆ తర్వాత సినిమా చూసి మరోసారి పొగిడేసింది. అంతలా రాజమౌళి విజన్‌కి ఫిదా అయిపోయిందన్నమాట. దేశంలో ఆయనలాంటి దర్శకుడు మరొకరు లేరు అని కూడా అనేసింది.

దీంతో రాజమౌళి నెక్స్ట్‌ సినిమాలో మంచి పాత్ర కొట్టేయాలనో, లేక ఆమెను ప్రధాన పాత్రధారిగా సినిమా చేయాలని కంగనా ఇలా అంటోందా అని ప్రశ్నలు మొదలయ్యాయి. తాజాగా ఇలాంటి ప్రశ్నలకు ఫుల్‌ స్టాప్‌ పెట్టే ప్రయత్నం చేసింది కంగన. “నేను రాజమౌళి దర్శకత్వ పనితనం చూసి మెచ్చుకుంటున్నాను. నేను అవకాశాల కోసం దర్శకులను, కథానాయకులను ఎప్పుడూ పొగడను. అసలది నా వ్యక్తిత్వమే కాదు. రాజమౌళి సినిమాలన్నీ చూశాను. ఆ విజన్‌కి హ్యాట్సాఫ్’’ అని మెచ్చేసుకుంది కంగన. ఆ తర్వాత ‘‘నేను ఎంత పెద్ద దర్శకుడినైనా పాత్రలు ఇవ్వమని అడగను” అంటూ మరోసారి క్లారిటీ ఇచ్చింది.

ఒకవేళ తర్వాతి మూవీలో నటించే ఛాన్స్ రాజమౌళి ఇస్తే.. ఆ అవకాశాన్ని ఎట్టి పరిస్థితుల్లో వదులుకోను. అయితే నా అంతట నేను అవకాశం అడగను’’ అని చెప్పింది కంగన. అంటే ఇన్‌డైరెక్ట్‌గా మీరే నన్ను పిలవడం, నేను మీ దగ్గరకు రాను అని అంటోందా? ఏమో కంగనకే తెలియాలి. మరి రాజమౌళి కంగనకి హీరోయిన్ గానో, లేదంటే ‘ప్రత్యేక పాత్ర’ ఏదైనా ఇస్తారా? పాన్ ఇండియా మార్కెట్ కోసం ఆయన ఇటీవల బాలీవుడ్ నటులను తన సినిమాల్లో తీసుకుంటున్నారు. ‘ఆర్ ఆర్ ఆర్’లో అజయ్ దేవగన్ కి కీలక పాత్ర ఇచ్చారు రాజమౌళి. మరి, కంగనాకి కూడా అలాంటిది ఏమైనా రాజమౌళి ప్లాన్ చేస్తారేమో చూడాలి.

‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ నుండీ అదిరిపోయే 20 డైలాగులు..!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
‘ప్రతిఘటన’ తో గోపీచంద్ తండ్రి టి.కృష్ణ దర్శకత్వం వహించిన సినిమాల లిస్ట్..!
5 ఏళ్ళ కెరీర్ లో రష్మిక మందన మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus