Kangana Ranaut: సౌత్ స్టార్స్ పై మళ్లీ అభిమానాన్ని చాటుకున్న కంగనా!

బాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఒకరైన కంగనా రనౌత్ కు ఫైర్ బ్రాండ్ గా గుర్తింపు ఉంది. తను చేసే కామెంట్ల ద్వారా తరచూ కంగనా వార్తల్లో నిలుస్తూ ఉండటంతో పాటు ట్రోల్స్ కు గురవుతూ ఉంటారు. అయితే గత కొంతకాలంగా బాలీవుడ్ స్టార్స్ పై విమర్శలు చేస్తూ టాలీవుడ్ స్టార్స్ ను పొగుడుతున్న కంగనా రనౌత్ తాజాగా మరోసారి సౌత్ స్టార్స్ పై ప్రశంసలు కురిపించారు. కంగనా రనౌత్ తన ఇన్ స్టాగ్రామ్ స్టోరీలో స్టార్ హీరోల ఫోటోలను షేర్ చేశారు.

Click Here To Watch NOW

ఆ ఫోటోలలో కన్నడ స్టార్ హీరో యశ్ తన భార్యతో కలిసి పూజలు చేస్తుండగా చరణ్ అయ్యప్ప మాలలో, జూనియర్ ఎన్టీఆర్ ఆంజనేయ దీక్షలో కనిపించారు. బన్నీ తన ఇద్దరు బ్రదర్స్ తో కలిసి పెద్ద బొట్టు పెట్టుకుని కనిపించారు. ఈ ఫోటోలతో పాటు కంగనా తన పోస్ట్ లో సౌత్ ఇండియా స్టార్ హీరోలు ఎంతో ఒదిగి ఉంటూ తమ సంస్కృతిని కాపాడుకుంటూ వచ్చారని కంగనా రనౌత్ కామెంట్లు చేశారు.

కంగనా రనౌత్ మరో ఇన్ స్టాగ్రామ్ స్టోరీలో కేజీఎఫ్2 సినిమాలోని యశ్ ఫోటోను షేర్ చేశారు. గత కొన్ని దశాబ్దాలుగా మన దేశం మిస్ అవుతున్న యాంగ్రీ యంగ్ మేన్ యశ్ అని కంగనా రనౌత్ కామెంట్లు చేశారు. 1970 సంవత్సరం అమితాబ్ ఏం చేశారో దానిని యశ్ రిపీట్ చేస్తున్నారని కంగనా రనౌత్ చెప్పుకొచ్చారు. కంగనా రనౌత్ చేసిన కామెంట్లు యశ్ అభిమానులకు సంతోషాన్ని కలిగిస్తున్నాయి. కంగనా రనౌత్ ప్రశంసిస్తూ ఉండటంతో టాలీవుడ్ స్టార్ హీరోల అభిమానులు సైతం ఎంతగానో సంతోషిస్తున్నారు.

కంగనా రనౌత్ కెరీర్ తొలినాళ్లలో ఏక్ నిరంజన్ సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. పూరీ జగన్నాథ్ డైరెక్షన్ లో ప్రభాస్ హీరోగా ఈ సినిమా తెరకెక్కింది. అయితే బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా డిజాస్టర్ గా నిలిచింది. ఈ సినిమా ఫ్లాప్ కావడం వల్ల కంగనా రనౌత్ కు తెలుగులో కొత్త సినిమా ఆఫర్లు రాలేదు.

‘కె.జి.ఎఫ్2’ నుండీ అదిరిపోయే 23 డైలాగులు ఇవే..!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
తెలుగులో అత్యధిక థియేట్రికల్ బిజినెస్ చేసిన సినిమాల లిస్ట్..!
‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు బాక్సాఫీస్ వద్ద భారీ లాభాలను అందించిన 10 సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus