Kangana: సంవత్సరానికి 40 కోట్ల నష్టం.. నటి కంగనా షాకింగ్ కామెంట్స్!

బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రౌనత్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. బాలీవుడ్ ఇండస్ట్రీలో అగ్ర నటిగా కొనసాగుతున్నటువంటి ఈమె తరచూ బాలీవుడ్ స్టార్ హీరోలపై హీరోయిన్లపై తీవ్ర స్థాయిలో మండిపడుతూ కామెంట్లు చేస్తుంటారు. అలాగే తనకు నచ్చని వ్యాఖ్యలు ఎవరైనా చేసిన ఆ వ్యాఖ్యలపై స్పందిస్తూ తన అభిప్రాయాలను తెలియజేస్తూ ఉంటారు.ఇక ఈమె సినిమాల గురించి మాత్రమే కాకుండా రాజకీయాలు హిందుత్వం గురించి కూడా మాట్లాడుతూ కామెంట్ చేస్తుంటారు.

బిజెపి పార్టీకి చాలా మద్దతు తెలుపుతున్నటువంటి కంగనా హిందుత్వం గురించి తరచూ మాట్లాడుతూ సోషల్ మీడియా వేదికగా పోస్టులు చేస్తుంటారు అయితే తాజాగా ఈమె ట్విట్టర్ సీఈఓ ఏలన్ మస్క్ తనకు ఆదర్శం అంటూ సోషల్ మీడియా వేదికగా చేసిన పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది. నేను నాకిష్టమైందే చేస్తాను… నేను నమ్మిన దానిపై నిలబడతాను, దాని వల్ల డబ్బులు నష్టపోయినా పర్లేదని ఆయన చేసిన వ్యాఖ్యలను ఈమె తన ఇంస్టాగ్రామ్ స్టోరీ ద్వారా షేర్ చేసారు.

తాను (Kangana) కూడా డబ్బుకు ఆశపడకుండా తాను నమ్మిన దానిపై నిలబడటమే కాకుండా తనకి ఇష్టమైన పనులు చేస్తానంటూ చెప్పుకొచ్చారు.ఇక తాను చేసే రాజకీయ వ్యాఖ్యలు సినీ వ్యాఖ్యలు గురించి అలాగే హిందుత్వం గురించి మాట్లాడటం,అరాజకీయ నాయకులు, దేశ వ్యతిరేకులకు, రౌడీ గ్యాంగ్ గురించి మాట్లాడటం వల్ల నాకు 20 నుంచి 25 బ్రాండ్ ఎండార్స్మెంట్ లు పోయాయి అంటూ ఈమె షాకింగ్ విషయాలను తెలియజేశారు.

రాత్రికి రాత్రే కొన్ని బ్రాండ్స్ నుంచి నన్ను తప్పించారు. కొన్ని సినిమాల నుంచి కూడా తప్పించారు. ఇలా తనకు ఏడాదికి సుమారు 30 నుంచి 40కోట్ల వరకు నష్టం వాటిల్లుతుందని తెలియజేశారు. అయిన ఆ డబ్బు పోయిన నేను స్వేచ్ఛగా ఉన్నాను నాకు నచ్చినది మాట్లాడుతూ నాకు నచ్చిన విధంగా ఉంటున్నాను అంటూ ఈ సందర్భంగా కంగనా చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

కస్టడీ సినిమా రివ్యూ & రేటింగ్!
ది స్టోరీ ఆఫ్ ఏ బ్యూటీఫుల్ గర్ల్ సినిమా రివ్యూ & రేటింగ్!

భీమ్లా ని కొట్టలేకపోయిన ఆదిపురుష్ ట్రైలర్.. అతి తక్కువ టైంలో 100K లైక్స్ కొట్టిన తెలుగు ట్రైలర్లు!
కమల్ హాసన్ ‘హే రామ్’ తో పాటు ఇండియాలో బ్యాన్ చేసిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus