గత కొన్ని నెలలుగా బాలీవుడ్ ఇండస్ట్రీకి సరైన సక్సెస్ లేదనే సంగతి తెలిసిందే. బ్రహ్మాస్త్ర సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీకి పూర్వ వైభవం వస్తుందని అందరూ భావించగా ఈ సినిమా బిలో యావరేజ్ రిజల్ట్ ను అందుకుంది. విడుదలకు ముందే భారీ అంచనాలు నెలకొనడంతో ఈ సినిమాకు ఈ సినిమాకు తొలిరోజు భారీస్థాయిలో కలెక్షన్లు వచ్చాయి. అయితే శని, ఆదివారాలలో కూడా ఈ సినిమాకు బుకింగ్స్ ఆశించిన స్థాయిలో లేవని తెలుస్తోంది.
బ్రహ్మాస్త్ర సినిమా విషయంలో క్రిటిక్స్ నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ తాజాగా బ్రహ్మాస్త్ర సినిమా గురించి స్పందిస్తూ షాకింగ్ కామెంట్లు చేయగా ఆ కామెంట్లు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. బ్రహ్మాస్త్ర డైరెక్టర్ అయాన్ ముఖర్జీని మేధావి అని మెచ్చుకున్న వాళ్లందరినీ జైలులో పెట్టాలని కంగనా రనౌత్ చెప్పుకొచ్చారు. సినిమా అసలేం బాలేదని ఆమె అన్నారు. బ్రహ్మాస్త్ర సినిమాను తెరకెక్కించడంలో అయాన్ ముఖర్జీ ఫెయిల్ అయ్యాడని కంగనా కామెంట్లు చేశారు.
ఈ సినిమాను తెరకెక్కించడానికి ఆయనకు 12 ఏళ్లు పట్టిందని 600 కోట్ల రూపాయలను ప్రొడక్షన్ ఖర్చుల రూపంలో ఆయన కాల్చి బూడిద చేశాడని కంగనా చెప్పుకొచ్చారు. ఇలాంటి డైరెక్టర్ ను మేధావి అనడం జోక్ గా అనిపిస్తోందని కంగనా కామెంట్లు చేశారు. కరణ్ జోహార్ సినిమా కథల కంటే ఇతరుల శృంగార జీవితాలపై ఎక్కువగా దృష్టి పెట్టారని కంగనా తెలిపారు. కరణ్ జోహార్ రివ్యూలు, రేటింగ్స్, కలెక్షన్ల వివరాలను సైతం డబ్బుతో కొంటున్నారని కంగనా ఆరోపణలు చేశారు.
సౌత్ ప్రేక్షకుల దృష్టిని సొంతం చేసుకోవాలని కరణ్ జోహార్ ప్రయత్నించాడని కంగనా చెప్పుకొచ్చారు. కరణ్ జోహార్ తన సినిమాలను ప్రమోట్ చేయాలని సౌత్ రైటర్లను, డైరెక్టర్లను, నటీనటులను కోరుతున్నాడని కంగనా రనౌత్ కామెంట్లు చేశారు. ఇలా చేయడానికి బదులుగా మంచి టాలెంట్ తో సినిమాలు తీస్తే సరిపోతుంది కదా అని కంగనా రనౌత్ కామెంట్లు చేశారు.
Most Recommended Video
భూమా మౌనిక కు ఆల్రెడీ పెళ్లయిందా?
బిగ్ బాస్ కంటెస్టెంట్ రేవంత్ గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!
ఛార్మి మాత్రమే కాదు నిర్మాతలయ్యి భారీగా నష్టపోయిన హీరోయిన్ల లిస్ట్..!