ఇందిరా గాంధీకి నాకు పోలికలున్నాయన్న నటి.. ఏమైందంటే?

బాలీవుడ్ ప్రముఖ నటీమణులలో ఒకరైన కంగనా రనౌత్ కు ప్రేక్షకులలో ఊహించని స్థాయిలో క్రేజ్ ఉంది. ఫైర్ బ్రాండ్ గా పేరును సొంతం చేసుకున్న కంగనా రనౌత్ ఏం మాట్లాడినా సంచలనమే అనే సంగతి తెలిసిందే. సినిమా సెలబ్రిటీలు సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్లు చేయాలంటే భయపడతారు. అయితే కంగనా రనౌత్ మాత్రం ఏ మాత్రం అవకాశం ఉన్నా నెగిటివ్ కామెంట్లు చేయడానికి అస్సలు వెనుకాడరు. అయితే తాజాగా కంగనా రనౌత్ తనకు ఇందిరా గాంధీతో పోలికలు ఉన్నాయంటూ షాకింగ్ కామెంట్లు చేశారు.

బాల్యంలో షార్ట్ హెయిర్ తో దిగిన ఫోటోలను షేర్ చేసిన కంగనా రనౌత్ బాల్యంలో నేను ఎవరి హెయిర్ స్టైల్ ను ఫాలో అయ్యేదానిని కాదని వెల్లడించారు. నేను గ్రామంలో ఉండే బార్బర్ దగ్గరకు వెళ్లి నేనే స్వయంగా కటింగ్ ఏ విధంగా చెయ్యాలో చెప్పేదానినని చెప్పుకొచ్చారు. నేను నా హెయిర్ స్టైల్ షార్ట్ గా ఉండాలని కోరుకునేదానినని కంగనా రనౌత్ అన్నారు. హెయిర్ స్టైల్ షార్ట్ గా ఉండటం వల్ల నన్ను చాలామంది ఇందిరా గాంధీ అని పిలిచేవారని కంగనా రనౌత్ చెప్పుకొచ్చారు.

మరీ ముఖ్యంగా ఆర్మీలో ఉండే మా అంకుల్స్ ఈ విషయాన్ని చెబుతుండేవారని కంగనా రనౌత్ పేర్కొన్నారు. కంగనా రనౌత్ చేసిన కామెంట్లపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు కంగనా రనౌత్ గత సినిమాలు ప్రేక్షకులను ఏ మాత్రం ఆకట్టుకోలేదనే సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఎమర్జెన్సీ అనే సినిమాలో కంగనా రనౌత్ నటిస్తున్నారు. ఈ సినిమాలో కంగనా రనౌత్ ఇందిరా గాంధీ పాత్రలో నటిస్తున్నారు.

ఈ కారణం వల్లే కంగనా రనౌత్ ఈ తరహా కామెంట్లు చేయడం గమనార్హం. కంగనా రనౌత్ గత సినిమాలకు ఆశించిన స్థాయిలో కలెక్షన్లు రాలేదనే సంగతి తెలిసిందే. తర్వాత ప్రాజెక్ట్ లతో అయినా కంగనా రనౌత్ సక్సెస్ లను అందుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

శాకిని డాకిని సినిమా రివ్యూ & రేటింగ్!
నేను మీకు బాగా కావాల్సినవాడిని సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ గీతు రాయల్ గురించి ఆసక్తికర విషయాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus