Actress: స్టార్ కపుల్ పై స్టార్ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్.. విడాకులు ఫిక్సా?

సినిమా వాళ్ళు ప్రేమించుకోవడం, బ్రేకప్ చెప్పుకోవడం, పెళ్ళి చేసుకోవడం, విడాకులు తీసుకోవడం అనేవి కొత్త విషయాలు కాదు. ఒక నాలుగు రోజులు మాత్రం అవి హాట్ టాపిక్ అవుతాయి. టాలీవుడ్ సెలబ్రిటీలు అయితే ఇలాంటి విషయాల్లో ఓపెన్ అవ్వడానికి చాలా టైం తీసుకుంటారు. కానీ బాలీవుడ్ జనాలు పెద్దగా టైం తీసుకోరు. వాళ్ళ గురించి ఇంకొకరు చులకనగా మాట్లాడే అవకాశం కూడా ఇవ్వరు. అయితే ఓ స్టార్ కపుల్ గురించి మరో స్టార్ హీరోయిన్ చేసిన కామెంట్స్ ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చనీయాంశం అయ్యాయి.

నిత్యం వివాదాల్లో నిలిచే కంగనా రనౌత్ (Actress) తాజాగా అలియా భట్, రన్ బీర్ కపూర్ ల జంట పై షాకింగ్ కామెంట్స్ చేసింది. ‘ఓ బాలీవుడ్ జంట ఇప్పుడు వేర్వేరుగా ఉంటున్నారు. కానీ కలిసే ఉన్నట్టు కవరింగ్ ఇస్తున్నారు. భర్త తన కుటుంబంతో కలిసి విదేశాలకి వెళ్తే.. భార్య తన కూతురితో కలిసి ఇక్కడే ఉంది. ప్రేమతో చేసుకున్న పెళ్లిళ్లు నిలబడతాయి.

కానీ సినిమా ప్రమోషన్ కోసం, డబ్బు కోసం చేసుకున్న పెళ్లిళ్లు నిలబడవు. అతను ఇష్టపడి పెళ్లి చేసుకోలేదు. మాఫియా డాడీ ఒత్తిడితో పెళ్లి చేసుకున్నాడు.అది నకిలీ పెళ్లి. ఇప్పుడు ఆ నకిలీ పెళ్లి నుండి విముక్తికై చూస్తున్నాడు’ అంటూ రాసుకొచ్చింది. దీంతో కంగనా మరోసారి హాట్ టాపిక్ అయ్యింది. సోషల్ మీడియాలో కొంతమంది నెటిజన్లు అలాగే రన్ బీర్, అలియా అభిమానులు ఆమె పై మండిపడుతూ కామెంట్లు పెడుతున్నారు.

పాత్ర కోసం ఇష్టాలను పక్కన పడేసిన నటులు వీళ్లేనా..!

సీరియల్ హీరోయిన్స్ రెమ్యూనరేషన్ తెలిస్తే మతిపోతోంది !
ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో సందడి చేయబోతున్న 19 సినిమాలు/ సిరీస్ లు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus