నాగచైతన్య, సాయిపల్లవి హీరోహీరోయిన్లుగా శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో తెరకెక్కిన లవ్ స్టోరీ సినిమా వినాయకచవితి కానుకగా రిలీజవుతున్న సంగతి తెలిసిందే. లవ్ స్టోరీకి పోటీగా థియేటర్లలో మరో సినిమా విడుదల కాకపోవచ్చని మేకర్స్ భావించారు. అయితే జయలలిత బయోపిక్ గా తెరకెక్కిన తలైవి సినిమా కూడా సెప్టెంబర్ 10వ తేదీనే రిలీజ్ కానున్నట్టు అధికారిక ప్రకటన వెలువడటం గమనార్హం. ఇప్పటికే సెప్టెంబర్ 10వ తేదీన టక్ జగదీష్ ఓటీటీలో రిలీజ్ కానుందని వార్తలు వచ్చాయి.
టక్ జగదీష్ సినిమా లవ్ స్టోరీ కలెక్షన్లపై ప్రభావం చూపించే అవకాశాలు ఉన్నాయని మేకర్స్ భావిస్తుండగా లవ్ స్టోరీకి తలైవితో తలనొప్పితప్పేలా లేదు. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో తలైవి రిలీజ్ కానుండగా ఎ ఎల్ విజయ్ ఈ సినిమాకు దర్శకత్వం వహించడం గమనార్హం. ఈ సినిమాకు యు సర్టిఫికెట్ రాగా జీవీ ప్రకాష్ సంగీతం అందించారు. దేశవ్యాప్తంగా థియేటర్లు తెరుచుకోగా తమిళనాడులో 50 శాతం ఆక్యుపెన్సీతో థియేటర్లకు అనుమతులు వచ్చాయి.
కరోనా సెకండ్ వేవ్ తర్వాత రిలీజవుతున్న తొలి పాన్ ఇండియా మూవీ లవ్ స్టోరీ కావడం గమనార్హం. పొలిటికల్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా ఎలాంటి రిజల్ట్ ను సొంతం చేసుకుంటుందో చూడాల్సి ఉంది. తలైవి సినిమాలో ఎంజీఆర్ పాత్రలో అరవిందస్వామి నటించారు. తలైవి రిలీజ్ డేట్ వల్ల లవ్ స్టోరీ కలెక్షన్లు కొంతమేర తగ్గే అవకాశాలు ఉంటాయి. లవ్ స్టోరీ సినిమాపై ప్రేక్షకుల్లో భారీగా అంచనాలు నెలకొన్న సంగతి తెలిసిందే.
Most Recommended Video
చాలా డబ్బు వదులుకున్నారు కానీ ఈ 10 మంది యాడ్స్ లో నటించలేదు..!
గత 5 ఏళ్లలో టాలీవుడ్లో రూపొందిన సూపర్ హిట్ రీమేక్ లు ఇవే..!
రాజ రాజ చోర సినిమా రివ్యూ& రేటింగ్!