Kangana Ranaut: శివయ్య సన్నిధిలో కాంట్రవర్సీ బ్యూటీ!

బాలీవుడ్ సంచలన నటి కంగనా రనౌత్ నటించిన సినిమా ధాకడ్. నేడు ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ సినిమా విడుదలకానుంది. ఈ క్రమంలోనే పెద్ద ఎత్తున కంగనా ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహించారు. ఇక ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఎన్నో ఇంటర్వ్యూలలో పాల్గొన్న ఈమె ఎన్నో ఆసక్తికరమైన విషయాలను వెల్లడించడమే కాకుండా తన వ్యక్తిగత విషయాలను కూడా అందరితో పంచుకున్నారు. ఇకపోతే ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా ఈమె పలువురు బాలీవుడ్ స్టార్ సెలబ్రిటీల గురించి తీవ్ర స్థాయిలో విమర్శలు కురిపించారు.

బాలీవుడ్ సెలెబ్రిటీల పై విమర్శలు చేస్తూ సౌత్ ఇండస్ట్రీ పై ప్రశంసలు కురిపించారు. ఈమె బాలీవుడ్ ఇండస్ట్రీ లో అగ్రతారగా కొనసాగుతూ ఉన్నప్పటికీ, బాలీవుడ్ ఇండస్ట్రీ గురించి తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ఇదిలా ఉండగా ఈ సినిమా నేడు విడుదల కావడంతో ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా ఈమె పలు దైవ దర్శనాలు కూడా చేస్తున్నారు. గత రెండు రోజుల క్రితం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న కంగనా తాజాగా కాశీ విశ్వనాధుని ఆలయాన్ని కూడా సందర్శించారు.

ఈ క్రమంలోనే చిత్ర బృందంతో కలిసి కాశీ చేరుకొని పరమేశ్వరుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.ప్రస్తుతం ఈమె కాశీకి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక స్వామివారిని దర్శించుకున్న అనంతరం మీడియాతో మాట్లాడుతూ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగానే కాశీ చేరుకుని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించానని వెల్లడించారు. మరి నేడు విడుదలైన ఈ సినిమా అభిమానులను ఎలా సందడి చేస్తుందో తెలియాల్సి ఉంది.

సర్కారు వారి పాట సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘తొలిప్రేమ’ టు ‘ఖుషి’.. రిపీట్ అవుతున్న పాత సినిమా టైటిల్స్ ఇవే..!
ఈ 12 మంది మిడ్ రేంజ్ హీరోల కెరీర్లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాలు ఇవే..!
ఈ 10 మంది సౌత్ స్టార్స్ తమ బాలీవుడ్ ఎంట్రీ పై చేసిన కామెంట్స్ ఏంటంటే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus