Kanguva: కంగువా వారి వల్లే ఆడలేదట.. నిర్మాత షాకింగ్ కామెంట్!

తమిళ సినిమా చరిత్రలో మరో బాహుబలిగా (Baahubali)  నిలుస్తుందని భావించిన కంగువ (Kanguva) బాక్సాఫీస్ వద్ద ఘోర పరాజయం చవిచూసింది. రిలీజ్ ముందు భారీ అంచనాలు క్రియేట్ చేసుకున్న ఈ చిత్రం ఫుల్ రన్‌లో కేవలం రూ.200 కోట్ల గ్రాస్ మాత్రమే క్లోజ్ అయ్యేలా ఉంది. సినిమా కోసం చేసిన బిజినెస్‌కి సగం కూడా థియేటర్ల నుంచి రాలేదని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఈ ఫలితంతో నిర్మాతలు, బయ్యర్లు నష్టాలు ఎదుర్కొంటున్నారు. ఇక చిత్ర నిర్మాత జ్ఞానవేల్ రాజా (K. E. Gnanavel Raja)  తొలుత నెగెటివ్ టాక్‌పై గంభీరంగా స్పందిస్తూ, కంగువ హిట్ అని, సెకండ్ పార్ట్ కూడా వస్తుందని పేర్కొన్నారు.

Kanguva

కానీ, సినిమా ఆ తర్వాత పెద్దగా పుంజుకోలేకపోయింది. ఈ నేపథ్యంలో సహ నిర్మాత ధనంజయన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. కంగువ పరాజయం కారణం కంటెంట్ కాదని, అదంతా ఇలాంటి పరిస్థితులు కావడం వల్లేనని ఆయన అన్నారు. ధనంజయన్ మాట్లాడుతూ, “సూర్య  (Suriya) ఉన్నత స్థాయికి ఎదగడం కొందరు తట్టుకోలేకపోతున్నారు. సినిమాను టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో పెద్ద స్థాయిలో నెగెటివ్ క్యాంపైన్ చేశారు.

ముఖ్యంగా ఇద్దరు పెద్ద హీరోల అభిమానులు, వారి రాజకీయ పార్టీల అండతో ఈ సినిమాపై అసత్య ప్రచారం చేశారు,” అని ఆరోపించారు. దీంతో ప్రేక్షకుల్లో కంగువ పై ప్రతికూల అభిప్రాయం ఏర్పడి, థియేటర్లకు రావడం తగ్గిందని తెలిపారు. సోషల్ మీడియాలో విడుదలకు ముందే భారీ నెగెటివిటీతో సినిమా పలు సమస్యలు ఎదుర్కొన్న విషయం వాస్తవమే. ఈ కారణంగా మొదటి రోజు నుంచే తక్కువ ఆక్యుపెన్సీ నమోదయ్యిందని ట్రేడ్ అనలిస్ట్‌లు అంటున్నారు.

ధనంజయన్ వ్యాఖ్యల నేపథ్యంలో, ఇతర సినిమాలకూ ఇదే పరిస్థితి తప్పదని, టాలీవుడ్లోనూ ఈ ట్రెండ్ ఉధృతంగా ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రస్తుతం సూర్య అభిమానులు ఈ ఆరోపణలపై మద్దతు పలుకుతున్నారు. అయితే ఇతర హీరోల అభిమానుల నుంచి కూడా దీన్ని ఖండిస్తూ కౌంటర్ వస్తోంది.

పుష్ప 2 తరువాత బన్నీ ప్లాన్ ఏంటీ?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus