ప్రముఖ సీనియర్ నటుడు మృతి
- November 30, 2025 / 12:46 PM ISTByPhani Kumar
సినీ పరిశ్రమలో విషాదాల సంఖ్య పెరుగుతూనే ఉంది తప్ప తగ్గడం లేదు. నిత్యం ఎవరొకరు మరణిస్తూనే ఉన్నారు. ఏదో ఒక బ్యాడ్ న్యూస్ వింటూనే ఉన్నాం. అనారోగ్య సమస్యలతో కొంతమంది,ప్రమాద వశాత్తు ఇంకొంతమంది, ఆత్మహత్యలు చేసుకుని కొందరు,ప్రమాదవశాత్తు ఇంకొందరు ఇలా ఎవరొకరు మరణిస్తూనే ఉన్నారు. కోటా శ్రీనివాసరావు వంటి దిగ్గజ నటులు సైతం ఈ ఏడాది మృతి చెందారు.
M. S. Umesh
అలాగే కె.జి.ఎఫ్ నటుడు హరీష్ రాయ్, ‘షోలే’ నటుడు ధర్మేంద్ర వంటి వారు సైతం మరణించడం జరిగింది. ఈ షాక్..ల నుండి సినీ పరిశ్రమ ఇంకా కోలుకోకుండానే ఇంకో బ్యాడ్ న్యూస్ వినాల్సి వచ్చింది. కన్నడ సినీ పరిశ్రమలో విషాదం చోటు చేసుకున్నట్టు సమాచారం.

వివరాల్లోకి వెళితే.. ప్రముఖ కన్నడ సీనియర్ నటుడు కమ్ కమెడియన్ అయినటువంటి ఎం.ఎస్.ఉమేశ్ కన్నుమూశారు. ఆయన వయసు 80 ఏళ్ళు కావడం గమనార్హం. గత కొన్నాళ్లుగా అనారోగ్య సమస్యలతో అలాగే వయోభారంతో బాధపడుతూ వస్తున్నారు ఉమేష్. ఈ మధ్య ఎక్కువగా ఎక్కడికీ వెళ్లకుండా ఇంటి వద్దే ఉండి విశ్రాంతి తీసుకుంటూ.. వైద్యులను ఇంటికి పిలిపించి చికిత్స తీసుకుంటున్నారు.
అయితే పరిస్థితి విషమించడంతో ఆయన కన్నుమూసినట్టు స్పష్టమవుతుంది. 1960లో ఉమేష్ నటుడిగా మారారు. చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఎంట్రీ ఇచ్చిన ఆయన ఇప్పటివరకు 350కి పైగా సినిమాల్లో నటించారు. 6 దశాబ్దాలుగా ఆయన నటుడిగా రాణిస్తున్నారు. దీంతో ఆయన మరణ వార్త కన్నడ చిత్ర పరిశ్రమను కృంగదీస్తుంది అని చెప్పాలి. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని అక్కడి ఫిలిం మేకర్స్ ఆశిస్తూ తమ సానుభూతి తెలుపుతున్నారు.
















