అల్లు అర్జున్ సినిమాలో ఆర్జీవీ నటుడు…!

‘నా పేరు సూర్య.. నా ఇల్లు ఇండియా’ వంటి డిజాస్టర్ తర్వాత అల్లు అర్జున్ ఏడాదిన్నర గ్యాప్ తీసుకుని ‘అల వైకుంఠపురములో’ చిత్రం చేసాడు. ఈ చిత్రంతో తన కెరీర్ బెస్ట్ అందుకుని ఫుల్ ఫామ్లో ఉన్నాడు. ఈ చిత్రం అంత పెద్ద హిట్ అవ్వడంతో బన్నీ ఫ్యాన్స్ ఆకలి కూడా తీరింది అనే చెప్పాలి. ఇక ఇదే జోష్ తో తన తరువాతి చిత్రాన్ని కూడా మొదలుపెట్టాడు. తనకి ‘ఆర్య’ ‘ఆర్య2’ వంటి డిఫరెంట్ మూవీస్ ఇచ్చిన సుకుమార్ తో మూడవ చిత్రంగా ‘పుష్ప’ చేస్తున్నాడు.

తెలుగుతో పాటు తమిళ,హిందీ, మలయాళ, కన్నడ భాషల్లో ఈ చిత్రం రూపొందుతుంది. పాన్ ఇండియా చిత్రం కావడంతో అన్ని భాషలోనూ క్రేజ్ ఉన్న నటుల్ని ఈ ప్రాజెక్ట్ కు ఎంచుకుంటున్నారు. ఇందులో భాగంగా ఇప్పుడు ఓ కన్నడ స్టార్ ను ఎంచుకున్నట్టు తెలుస్తుంది. ఆ కన్నడ నటుడు మరెవరో కాదు ధనుంజయ్. గతంలో ఈయన రాంగోపాల్ వర్మ రూపొందించిన ‘భైరవగీత’ లో నటించాడు. ఇప్పుడు ‘పుష్ప’ లో ఓ కీలక పాత్ర కోసం తీసుకున్నట్టు సమాచారం.

ఇక హిందీ నుండీ ఊర్వశి రౌతుల ను ఓ ఐటెం సాంగ్ కు అలాగే… విలన్ గా సునీల్ శెట్టి వంటివారిని తీసుకోవాలి అనే ఆలోచనలో చిత్ర యూనిట్ సభ్యులు ఉన్నట్టు తెలుస్తుంది. ఇక రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం దర్శకుడు.

Most Recommended Video

అత్యధిక టి.ఆర్.పి నమోదు చేసిన సినిమాల లిస్టు!
టాలీవుడ్ టాప్ హీరోల వరస్ట్ లుక్స్ ఇవే!
మన హీరోయిన్ల ఫ్యామిలీస్ సంబంధించి రేర్ పిక్స్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus