మంచు విష్ణు డ్రీం ప్రాజెక్టు ‘కన్నప్ప’ (Kannappa) సినిమా గత వారం అంటే జూన్ 27న రిలీజ్ అయ్యింది. మంచు విష్ణు (Manchu Vishnu) ఈ చిత్రాన్ని రూ.200 కోట్ల బడ్జెట్ తో నిర్మించారు. మొదటిరోజు ఈ సినిమాకు ప్రేక్షకుల నుండి మంచి స్పందన వచ్చింది. ప్రభాస్ కామియో, మోహన్ లాల్ కామియో వంటివి ఆకట్టుకున్నాయి.శివుడి పాత్రలో అక్షయ్ కుమార్ కూడా బాగా చేశారు. అయితే ప్రభాస్ ఇమేజ్ దీనికి తోడై మంచి ఓపెనింగ్స్ ను తెచ్చిపెట్టింది. దీంతో మంచు విష్ణు కెరీర్లో హైయెస్ట్ ఓపెనింగ్స్ నమోదైనట్టు అయ్యింది.
వీకెండ్ బాగా కలెక్ట్ చేసిన ఈ సినిమా సోమవారం నుండి కొంచెం డౌన్ అయ్యింది. అయినప్పటికీ పర్వాలేదు అనిపిస్తుంది అనే చెప్పాలి. ‘కన్నప్ప’ (Kannappa) 5 డేస్ కలెక్షన్స్ ను ఒకసారి గమనిస్తే :
నైజాం | 6.06 cr |
సీడెడ్ | 2.13 cr |
ఉత్తరాంధ్ర | 1.98 cr |
ఈస్ట్ | 1.10 cr |
వెస్ట్ | 0.78 cr |
గుంటూరు | 0.83 cr |
కృష్ణా | 0.74 cr |
నెల్లూరు | 0.70 cr |
ఏపీ+తెలంగాణ | 14.32 cr (షేర్) |
రెస్ట్ ఆఫ్ ఇండియా | 4.11 cr |
ఓవర్సీస్ | 2.35 cr |
వరల్డ్ టోటల్ | 20.78 cr (షేర్) |
‘కన్నప్ప’ (Kannappa) చిత్రానికి వరల్డ్ వైడ్ గా రూ.86 కోట్లు థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కోసం రూ.87 కోట్లు షేర్ ను రాబట్టాల్సి ఉంది. మొదటి 5 రోజుల్లో ఈ సినిమా రూ.20.78 కోట్ల షేర్ ను రాబట్టింది. గ్రాస్ పరంగా రూ.38 కోట్లు కలెక్ట్ చేసింది. బ్రేక్ ఈవెన్ కోసం మరో రూ.66.22 కోట్ల షేర్ ను రాబట్టాలి. అంత టార్గెట్ రీచ్ అవ్వడం అయితే కష్టమే కానీ.. ఉన్నంతలో ఈ సినిమా బాగానే కలెక్ట్ చేస్తుంది అని చెప్పాలి.