Mohanlal: లాలెటన్‌ కుమార్తె కూడా సినిమాల్లోకి.. కథల నుంచి హీరోయిన్‌గా!

మలయాళ సినిమా పరిశ్రమలోకి మరో వారసురాలు రాబోతోంది. గత కొన్నేళ్లుగా సినిమా పరిశ్రమకు దగ్గరగానే ఉన్నా.. ఎక్కడా నటన వాసను అంటించుకోకుండా సాగుతున్న ఆ వారసురాలు ఎట్టకేలకు ముఖానికి రంగేసుకోబోతంది. ఆమెనే ప్రముఖ నటుడు మాలీవుడ్‌ లాలెటన్‌ మోహన్‌ లాల్‌ (Mohanlal) కుమార్తె విస్మయ. ‘తుడక్కమ్‌’ అనే సినిమాతో ఆమె వెండితెరకు పరిచయం కాబోతున్నారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ మోహన్‌ లాల్‌ సోషల్ మీడియాలో పోస్ట్‌ పెట్టారు.

Mohanlal

‘‘డియర్‌ మయా కుట్టి ‘తుడక్కమ్‌’ సినిమా నీ మొదటి అడుగే కావచ్చు. కానీ, జీవితాంతం సినిమాతో కొనసాగే బంధం’’ అని ఆ పోస్టులో రాసుకొచ్చారు మోహన్‌ లాల్‌ (Mohanlal). జూడ్‌ ఆంటోని జోసెఫ్‌ దర్శకత్వంలో రూపొందనున్న ఈ సినిమాను మోహన్‌ లాల్‌ సన్నిహితుడు ఆంటోని పెరంబవూర్‌ నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్‌ మరిన్ని వివరాలు త్వరలోనే అనౌన్స్‌ చేస్తారట. ఆంటోనీ జోసెఫ్‌ గతంలో ‘సారాస్‌’, ‘2018’ వంటి హిట్‌ సినిమాల దర్శకుడు.

కథా రచన అంటే ఆసక్తి ఉన్న విస్మయ సినిమాల్లోకి వస్తారంటూ, రావాలంటూ చాలా ఏళ్లుగా మోహన్‌ లాల్‌ అభిమానులు అడుగుతూ ఉండేవారు. ప్రణవ్‌ మోహన్‌లాల్ (Mohanlal), కల్యాణ్‌ ప్రియదర్శన్‌, దుల్కర్‌ సల్మాన్‌ లాంటి వాళ్లు సినిమాల్లోకి వచ్చినప్పుడు విస్మయ కూడా రావాల్సింది అని అనేవారు. ఇప్పుడు, ఇన్నేళ్లకు విస్మయ సినిమాల్లోకి వస్తోంది. మరి ఆమె ఎలాంటి కథతో ప్రేక్షకుల ముందుకొస్తుంది అనేది చూడాలి.

‘2018’ సినిమా లాంటి సర్వైవల్‌ థ్రిల్లర్‌ తీసిన ఆంటోని ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండటంతో ఈ సినిమా కూడా అలాంటి డిఫరెంట్ కాన్సెప్ట్‌లో రావొచ్చు అనే చర్చ జరుగుతోంది. ఇక విస్మయ గురించి చూస్తే ఒకప్పుడు అధిక బరువు సమస్యను ఎదుర్కొంది. దాన్ని సవాల్‌గా తీసుకుని 22 కిలోలు తగ్గి ఇప్పుడు సినిమాల్లోకి వస్తోంది. సినిమాల కోసమో లేక వ్యక్తిగత అవసరమో కానీ థాయ్‌లాండ్‌లో మార్షల్‌ ఆర్ట్స్‌లోనూ శిక్షణ తీసుకుంది.

 ప్లాప్ గా నిలిచిన ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ ..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus