ఒహ్హో సౌత్ సినిమానా?.. అని ఒకప్పుడు అనేవాళ్లు. అయితే ఇప్పుడు సౌత్ సినిమా అంటే.. సత్తా ఉన్న సినిమా అని అంటున్నారు. దానికి కారణం సౌత్ నుండి వస్తున్న సినిమాలు పాన్ ఇండియా స్థాయిలో బాగా ఆడుతుండటమే. అందులో కన్నడ నాట నుండి వస్తున్న సినిమాలూ కూడా ఉన్నాయి అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ‘కేజీయఫ్’తో రాకీభాయ్ వచ్చి మొత్తం దేశాన్ని షేక్ చేశాడు. ‘కేజీయఫ్’ ఓ స్థాయి హిట్ అయితే..
‘కేజీయఫ్ 2’ మరో స్థాయి హిట్. దీంతో కన్నడ పరిశ్రమ గత కొన్ని రోజులుగా వెలిగిపోతోంది. తాజాగా ‘కేజీయఫ్’ వెలుగును కాంతార దాటేసింది. ‘కేజీయఫ్ 2’ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ. 1250 కోట్లు సాధించింది కదా.. ఆ లెక్కను ‘కాంతార’ ఎప్పుడు దాటేసింది అనే డౌట్ రావొచ్చు. అయితే ఇక్కడ మేం చెబుతున్నది కర్ణాటక వసూళ్లు మాత్రమే. ‘కేజీయఫ్ 2’ సినిమా కర్ణాటక వ్యాప్తంగా సుమారు రూ. 172 కోట్లు వసూలు చేసింది.
ఇప్పుడు ఆ వసూళ్లను ‘కాంతార’ కేవలం 60 రోజుల్లో క్రాస్ చేసిందట. దీంతో ఇప్పుడు కన్నడ చలన చిత్ర సీమలో ‘కాంతార’ సినిమానే టాప్ గ్రాసర్ అని చెప్పొచ్చు. అయితే, ఇక్కడ ఆలోచించాల్సిన విషయం ఇంకొకటి ఉంది. ‘కేజీయఫ్ 2’కి, ‘కాంతార’ సినిమకు మధ్య చాలా తేడాలున్నాయి. ‘కాంతారా’తో పోలిస్తే ‘కేజీయఫ్ 2’లో చాలామంది స్టార్లు ఉన్నారు. పైగా ‘కేజీయఫ్ 2’ బడ్జెట్ రూ.వందల కోట్లలో ఉంది. కానీ ‘కాంతార’ బడ్జెట్ పట్టుమని రూ.20 కోట్లు కూడా దాటలేదు.
కథే బలంగా నమ్ముకుని ‘కాంతార’ సినిమాను తీశారు. ప్రస్తుతానికి ‘కాంతార’ ప్రపంచవ్యాప్తంగా రూ.400 కోట్లకుపైగా వసూలు చేసింది. అలా ఎలా చూసినా.. ‘కాంతార’ సినిమాది తిరుగులేని రికార్డ్ అని చెప్పొచ్చు. ఇక్కడ ‘కేజీయఫ్’ను తక్కువ చేయలేం కానీ.. ‘కాంతార’ విజయం ఎక్కువ అని మాత్రం చెబుతున్నాం. అన్నట్లు ఈ రెండు సినిమాలూ హోంబలే ఫిల్మ్స్ నుండి వచ్చినవే కావడం గమనార్హం.
లవ్ టుడే సినిమా రివ్యూ& రేటింగ్!
తోడేలు సినిమా రివ్యూ & రేటింగ్!
ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా రివ్యూ & రేటింగ్!
ఇప్పటి వరకు బాలయ్య పేరుతో వచ్చిన పాటలు ఇవే..