రిషబ్ శెట్టి (Rishab Shetty) రుక్మిణీ వసంత్ జంటగా నటించిన డివోషనల్ అండ్ ఫాంటసీ మూవీ ‘కాంతార చాప్టర్ 1’. దసరా కానుకగా అక్టోబర్ 2న రిలీజ్ అయిన ఈ సినిమా ఇప్పటికీ మంచి వసూళ్లు సాధిస్తుంది. ‘కాంతార’ సూపర్ హిట్ అవ్వడంతో ‘కాంతార చాప్టర్ 1’ (Kantara Chapter 1) పై మొదటి నుండి మంచి అంచనాలు ఏర్పడ్డాయి. వాటిని పూర్తి స్థాయిలో అందుకోలేదు కానీ బాక్సాఫీస్ వద్ద డీసెంట్ కలెక్షన్స్ ను సాధిస్తూ రన్ ను కొనసాగిస్తుంది.
‘కాంతార’ హిట్ అవ్వడంతో ‘కాంతార చాప్టర్ 1’ ని భారీ థియేట్రికల్ బిజినెస్ జరిగింది. అందువల్ల తెలుగు రాష్ట్రాల్లో బ్రేక్ ఈవెన్ కష్టంగా కనిపిస్తున్నప్పటికీ ఓవరాల్ గా బ్రేక్ ఈవెన్ సాధించే అవకాశాలు అయితే ఉన్నాయి. దీపావళి సీజన్ ను కూడా ‘కాంతార చాప్టర్ 1’ బాగానే క్యాష్ చేసుకుంటుంది అని చెప్పాలి.
ఒకసారి 19 డేస్ కలెక్షన్స్ ని గమనిస్తే :
నైజాం | 29.59 cr |
సీడెడ్ | 9.26 cr |
ఉత్తరాంధ్ర | 8.54 cr |
ఈస్ట్ | 3.61 cr |
వెస్ట్ | 2.68 cr |
గుంటూరు | 3.88 cr |
కృష్ణా | 3.94 cr |
నెల్లూరు | 2.03 cr |
ఏపీ+తెలంగాణ టోటల్ | 63.53 cr |
రెస్ట్ ఆఫ్ ఇండియా | 1.52 cr |
టోటల్ వరల్డ్ వైడ్ | 65.05 కోట్లు(షేర్) (తెలుగు వెర్షన్) |
‘కాంతార చాప్టర్ 1’ (Kantara Chapter 1) చిత్రం తెలుగు వెర్షన్ కి ఏకంగా రూ.85 కోట్లు థియేట్రికల్ బిజినెస్ జరిగింది. బ్రేక్ ఈవెన్ కోసం రూ.86 కోట్లు షేర్ ను రాబట్టాల్సి ఉంది. 19 రోజుల్లో ‘కాంతార చాప్టర్ 1’ రూ.65.05 కోట్లు షేర్ ను రాబట్టింది. గ్రాస్ పరంగా రూ.115.12 కోట్లు తెలుగు రాష్ట్రాల్లో కలెక్ట్ చేసింది. బ్రేక్ ఈవెన్ కోసం మరో రూ.20.95 కోట్లు షేర్ ను రాబట్టాల్సి ఉంది. టార్గెట్ రీచ్ అవ్వడం అయితే కష్టమే కానీ.. ఉన్నంతలో కొన్ని మెరుపులు మెరిపిస్తుంది.