Rajinikanth: కొత్త సినిమా కోసం రజనీకాంత్‌ తనయ స్పెషల్‌ ప్లాన్‌.. ఏంటంటే?

‘లాల్‌ సలామ్‌’… చిన్నగా మొదలైన ఈ పెద్ద సినిమా ఇప్పుడు భారీ స్థాయికి వెళ్తోంది. రజనీకాంత్‌ను ముంబయి డాన్‌ మొయిద్దీన్‌ భాయ్‌గా ఇటీవల పోస్టర్‌ రిలీజ్‌ చేసి మరీ పరిచయం చేశారు. ఇప్పుడు ఏకంగా క్రికెట్‌ లెజెండ్‌ను సినిమాలో భాగం చేసుకున్నారు. ఆయనే హరియానా హరికేన్‌గా పేరు తెచ్చుకున్న కపిల్‌ దేవ్‌ను ఈ సినిమాలో నటింపజేస్తున్నారు. దీనికి సంబంధించి గురువారం సాయంత్రం ఓ ఫొటో బయటకు రాగా, శుక్రవారం పూర్తి వివరాలు వెల్లడించారు.

లైకా ప్రొడ‌క్ష‌న్స్ బ్యానర్‌ మీద ‘లాల్ సలామ్‌’ సినిమా తెరకెక్కుతోంది. రజనీకాంత్‌ తనయ ఐశ్వర్య రజనీకాంత్‌ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. విష్ణు విశాల్‌, విక్రాంత్ హీరోలుగా న‌టిస్తోన్న ఈ చిత్రంలో రజనీ ఓ ముఖ్యపాత్రధారి. తాజాగా క‌పిల్ దేవ్‌తో క‌లసి ఉన్న ఫొటోను షేర్ చేశారు తలైవా. ‘లెజెండ్రీ ప‌ర్స‌న్‌, మ‌నం అంద‌రం ఎంతో గౌర‌వించాల్సిన గొప్ప మ‌నిషి క‌పిల్ దేవ్‌తో క‌లసి ప‌ని చేయ‌టాన్ని గౌర‌వంగా భావిస్తున్నాను’’ అంటూ కపిల్ దేవ్‌తో వ‌ర్కింగ్ ఎక్స్‌పీరియెన్స్‌ను షేర్ చేసుకున్నారు ర‌జనీకాంత్‌.

మరోవైపు క‌పిల్ దేవ్ సైతం (Rajinikanth) ర‌జనీకాంత్‌తో ఉన్న ఫొటోను ఇన్‌స్టా స్టోరీలో షేర్ చేస్తూ ‘‘ర‌జనీకాంత్‌తో క‌లసి ప‌ని చేయ‌టం గౌర‌వంగా భావిస్తున్నాను’’ అని రాసుకొచ్చారు. ఎ.ఆర్‌.రెహ‌మాన్‌ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు సినిమాటోగ్ర‌ఫీని విష్ణు రంగస్వామి అందిస్తున్నారు. ఎడిటింగ్‌ పనులు బి.ప్ర‌వీణ్ భాస్క‌ర్‌ చూస్తుండగా, ఆర్ట్‌ డిపార్ట్‌మెంట్‌ను రాము తంగ‌రాజ్ నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ శరవేగంగా సాగుతోంది.

ఇదిలా ఉండగా రజనీకాంత్ త్వరలోనే నటనకు గుడ్‌బై చెబుతారంటూ ఓ చర్చ మొదలైంది. దర్శకుడు, నటుడు అయిన మిస్కిన్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ రజనీకాంత్‌ కొత్త సినిమా గురించి మాట్లాడారు. లోకేష్ కనకరాజ్ దర్వకత్వంలో నటించే చిత్రమే రజినీకాంత్‌కు చివరి సినిమా అవుతుంది అని కమెంట్‌ చేశారు. తన చివరి సినిమాకు దర్శకత్వం వహించమని లోకేష్‌ను తలైవా అడిగారని మిస్కిన్ చెప్పుకొచ్చారు. అయితే ఈ విషయంలో తలైవా నుండి ఎలాంటి అధికారిక సమాచారం లేదు.

బిచ్చగాడు 2 సినిమా రివ్యూ & రేటింగ్!
డెడ్ పిక్సల్స్ వెబ్ రివ్యూ & రేటింగ్!

అన్నీ మంచి శకునములే సినిమా రివ్యూ & రేటింగ్!
పిల్లలను కనడానికి వయస్సు అడ్డుకాదంటున్న సినీతారలు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus