karan Johar, Samantha: సమంత విడాకులను క్యాష్ చేసుకున్న కరణ్?

దక్షిణాది సినీ ఇండస్ట్రీలో అగ్రతారగా ఓ వెలుగు వెలుగుతున్న నటి సమంత గత కొంతకాలం నుంచి సోషల్ మీడియా వార్తల్లో నిలుస్తున్నారు. ఈమె నటుడు నాగచైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకుని విడిపోయిన తర్వాత కొన్ని రోజులు వార్తల్లో నిలిచినప్పటికీ ప్రస్తుతం తన సినిమాల పరంగా తాను ఎంతో బిజీగా గడుపుతున్నారు.సమంత నాగచైతన్యత విడిపోయిన తర్వాత విడాకులు గురించి పెద్ద ఎత్తున సందేహాలు వ్యక్తం అయినప్పటికీ ఈ విషయంపై వీరిద్దరూ స్పందించలేదు.

ఈ క్రమంలోనే అభిమానుల సైతం వీరి విడాకుల విషయం మరిచిపోతున్న క్రమంలో సమంత బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న కాఫీ విత్ కరణ్ టాక్ షోలో పాల్గొన్నారు. ఈ క్రమంలోని ఈ కార్యక్రమంలో భాగంగా సమంత విడాకుల గురించి నోరు విప్పారు. ఇలా సమంత విడాకుల గురించి ఈ కార్యక్రమం పై స్పందించిన ప్రోమో విడుదల చేయడంతో ఈ కార్యక్రమం పై పెద్ద ఎత్తున అంచనాలు ఏర్పడ్డాయి.

ఈ కార్యక్రమంలో భాగంగా కరణ్ సమంతను ఎలాంటి ప్రశ్నలు అడుగుతారు?విడాకులపై సమంత ఏ విధంగా స్పందిస్తుంది అంటూ ఎంతో ఆతృతగా ఎదురు చూశారు. అయితే ఈ ఎపిసోడ్ ప్రసారం కావడంతో ఈ ఎపిసోడ్ కు భారీగా వ్యూస్ వచ్చాయి. ఇలా సమంత విడాకుల విషయాన్ని కరణ్ జోహార్ భారీగా ఉపయోగించుకున్నారని అర్థమవుతుంది. సమంత ఎపిసోడ్ టెలికాస్ట్ కావడంతో ఈ ఎపిసోడ్ ఏకంగా కోట్లల్లో వ్యూస్ రాబట్టిందని తెలుస్తోంది.

కరణ్ టాక్ షో కి ఇదివరకు ఎప్పుడు రాని విధంగా వ్యూస్ రావడంతో ఆయనకు ఈ ఎపిసోడ్ వల్ల భారీగా లాభం కలిగిందని తెలుస్తోంది.ఇకపోతే సమంత కూడా అందరూ ఊహించిన విధంగానే ఈ కార్యక్రమంలో నాగచైతన్యతో తనకు విడాకులు రావడానికి గల కారణాలు తెలిపారు. అలాగే తన వ్యక్తిగత విషయాల గురించి కూడా సమంత ఈ సందర్భంగా తెలియజేశారు.

థాంక్యూ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఈ 10 మంది దర్శకులతో కనుక గోపీచంద్ సినిమాలు తీస్తే.. యాక్షన్ మూవీ లవర్స్ కు పండగే..!
డిజాస్టర్ టాక్ తో కూడా రూ.70 కోట్లు పైగా కలెక్ట్ చేసిన 10 సినిమాల లిస్ట్..!
హీరో తెలుగు – డైరెక్టర్ తమిళ్, డైరెక్టర్ తమిళ్- హీరో తెలుగు..వంటి కాంబోల్లో రాబోతున్న 11 సినిమాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus