బాలీవుడ్ సినిమాలు కొన్ని దశాబ్దాలపాటు దేశ సినిమా పరిశ్రమలో ఓ యేలు యేలాయి. ఏ సినిమా చేసినా హిట్ అయిపోతోంది అంటూ మిగిలిన ఇండస్ట్రీల జనాలు అనుకునేవారు. అయితే కరోనా – లాక్‌డౌన్ పరిస్థితుల తర్వాత ఒక్కసారిగా బాలీవుడ్ కుదేలైంది. ప్రస్తుతం తిరిగి పూర్వ వైభవానికి చేరుకోవడానికి ప్రయత్నాలు చేస్తోంది. పెద్ద సినిమాలు విజయాలు తక్కువగా ఉన్నా… కొన్ని సినిమాలు అనూహ్యమైన వసూళ్లు సాధిస్తున్నాయి. ఆ విషయంలో అనుమానాలు వస్తున్న ఈ సమయంలో ప్రముఖ నిర్మాత చేసిన వ్యాఖ్యలు ఆ డౌట్స్‌కి ఆజ్యం పోసేలా ఉన్నాయి.
బాలీవుడ్‌లో సినిమాల రివ్యూల విషయంలో, వసూళ్ల విషయంలో స్కామ్‌లు జరుగుతున్నాయని ఇటీవల విమర్శలు పెరిగాయి. సినిమాలు బాలేకపోయినా, యావరేజ్‌గా ఉన్నా డబ్బులు ఇచ్చి పాజిటివ్ రివ్యూలు రాయిస్తున్నారు అనేది ఆ విమర్శల సారాంశం. అయితే తాను కూడా తన సినిమాల విషయంలో అలాగే చేశానని షాకింగ్ విషయం బయటపెట్టారు ప్రముఖ బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్ జోహార్.
థియేటర్ల బయట సినిమాల గురించి మాట్లాడేవారు ఏదో ఒక సెన్సేషనల్ స్టేట్‌మెంట్ ఇవ్వాలని చూస్తుంటారు. అవి చూసి నిజమనుకుని ఆడియన్స్ థియేటర్లకు రావడం లేదు. అలా వాళ్లు వైరల్ అవ్వడం కోసం సినిమాలతో ఆడుకుంటున్నారు. కొన్నిసార్లు సొంత మనుషులనే మంచి రివ్యూలు ఇవ్వడానికి థియేటర్లకు పంపిస్తాం అని అసలు విషయం చెప్పేశారు కరణ్ జోహర్. సినిమా బతకడం కోసమే ఇలా చేస్తాం అని కూడా అన్నారాయన.
ఇక కొన్ని సినిమాలు యావరేజ్ ఫలితం అందుకున్నప్పుడు… అవి బాగా రన్ అవుతాయి అనే అభిప్రాయాన్ని ప్రేక్షకులకు కలిగించాలి. అలాంటప్పుడు సినిమా బాగుందని చెప్పించడం కోసం డబ్బులు ఇవ్వడం తప్ప వేరే దారిలేని పరిస్థితులు వస్తుంటాయి. అలా కొన్నిసార్లు సినిమాలకు మంచిగా రివ్యూ చెప్పడానికి డబ్బులు ఖర్చు పెట్టాల్సి వస్తోంది అని అన్నారు కరణ్ జోహర్. దీంతో కరణ్ (Karan Johar) చెప్పింది నిజమేనా అంటూ నెటిజన్లు చర్చించుకుంటున్నారు. టాలీవుడ్‌లో కూడా ఇలాంటి పరిస్థితి ఉందా అని మాట్లాడుకుంటున్నారు.
ఈ ఏడాది ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న తెలుగు సినిమాలు!
ఈ ఏడాది వచ్చిన 10 రీమేక్ సినిమాలు… ఎన్ని హిట్టు.. ఎన్ని ఫ్లాప్?
ఈ ఏడాది ప్రేక్షకులు తలపట్టుకొనేలా చేసిన తెలుగు సినిమాలు!