Karan Johar: యానిమల్ డైరెక్టర్ పై ప్రశంసలు కురిపించిన కరణ్ జోహార్?

అర్జున్ రెడ్డి సినిమాతో సెన్సేషనల్ డైరెక్టర్ గా మారినటువంటి డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ ఇటీవల యానిమల్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి మనకు తెలిసిందే. ఈ సినిమా డిసెంబర్ ఒకటవ తేదీ పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఈ సినిమా హవా ఇప్పటికీ కొనసాగుతూనే ఉందని చెప్పాలి. ఈ సినిమా పట్ల ఎంతోమంది ఇదివరకే ప్రశంసలు కురిపించారు. రణబీర్ కపూర్ రష్మిక మందన్న హీరో హీరోయిన్లుగా తెరకేక్కినటువంటి ఈ సినిమా పట్ల తాజాగా బాలీవుడ్ దర్శకుడు కరణ్ జోహార్ సినిమా పట్ల ప్రశంసల వర్షం కురిపించారు

ఈ సినిమా చూసినటువంటి కరణ్ (Karan Johar) ఈ సినిమాపై తన అభిప్రాయాలను తెలియజేశారు. ఈ సినిమాని తాను రెండుసార్లు చూశానని తెలిపారు. మొదటిసారి ఒక ప్రేక్షకుడిగా సినిమా చూశానని రెండోసారి ఈ సినిమాలో ఏముందని అధ్యయనం చేయడం కోసం చూసానని ఈయన వెల్లడించారు. ఈ సినిమా ఎంతో అద్భుతంగా ఉందని డైరెక్టర్ ఎంచుకున్న తీరుకు హాట్సాఫ్ అంటూ ఈయన ప్రశంసల వర్షం కురిపించారు.

ఇలా ఒక సినిమా గురించి ఇలాంటి అభిప్రాయం తెలియజేయాలి అంటే ఎంతో ధైర్యం ఉండాలని కూడా ఈయన తెలిపారు. ఈ సినిమా చూసి నేను కంటతడి పెట్టుకున్నానని సందీప్ రెడ్డి సినిమా పట్ల కరణ్ కామెంట్స్ చేశారు. ఈ ఏడాది నేను చూసిన సినిమాలన్నింటిలోకి యానిమల్ సినిమా ఒక ఉత్తమ చిత్రంగా పరిగణిస్తున్నానని ఈయన వెల్లడించారు.

ఈ సినిమా క్లైమాక్స్ లో హీరో విలన్ ఇద్దరూ కొట్టుకుంటూ ఉండగా వెనక బ్యాగ్రౌండ్ సాంగ్ వస్తుంది ఆ సన్నివేశం నన్ను ఎంతగానో ఆకట్టుకుందని ఆ సమయంలో నా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి అంటూ కరణ్ యానిమల్ సినిమా గురించి చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

ఈ ఏడాది ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న తెలుగు సినిమాలు!

ఈ ఏడాది వచ్చిన 10 రీమేక్ సినిమాలు… ఎన్ని హిట్టు.. ఎన్ని ఫ్లాప్?
ఈ ఏడాది ప్రేక్షకులు తలపట్టుకొనేలా చేసిన తెలుగు సినిమాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus