Karan Johar: మొన్న విజయ్ దేవరకొండకి… ఇప్పుడు ఆ స్టార్ హీరోకి.. అలాంటి వింత ప్రశ్నే!

బాలీవుడ్‌లో మంచి క్రేజ్ సంపాదించుకున్న టాక్ షో ఏది అంటే అందరూ కాఫీ విత్‌ కరణ్‌ అనే చెబుతుంటారు. ఎందుకంటే ఈ టాక్ షో కాస్త బోల్డ్‌గా ఉంటుంది. బాలీవుడ్లో స్టార్ ప్రొడ్యూసర్, అందరి స్టార్లతో స్నేహం ఎక్కువగా ఉండే దర్శకనిర్మాత కావడంతో కరణ్‌ జోహార్‌ అంటే చాలామందికి అభిమానం. ఇండస్ట్రీలో ఉన్న స్టార్లకు సంబంధించి ఈయనకి చాలా విషయాలు తెలుస్తుంటాయి. పెద్ద పలుకుబడి ఉన్న వ్యక్తి కాబట్టి కరణ్ ఎలాంటి ప్రశ్న అడిగినా ఈ టాక్ షోకి వచ్చే స్టార్ సెలబ్రిటీస్ హర్ట్ అవ్వరు.

అందుకే టీవీల్లో టెలికాస్ట్ అవుతున్నప్పుడే ఈ షోకి బోలెడంత క్రేజ్ నెలకొంది. ఈ మధ్య ఓటీటీల్లోకి కూడా వచ్చేసింది. ఇక బోల్డ్ నెస్ మామూలుగా ఉంటుందా? ఈ మధ్య కాలంలో స్ట్రీమింగ్ అయిన ఎపిసోడ్స్ చూస్తే ఈ విషయం ఎవరికైనా అర్థమవుతుంది. ఈ మధ్య కాలంలో మన టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ కి సె*స్ గురించి ప్రశ్నలు కూడా ఎదురయ్యాయి అంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.

ఇదిలా ఉండగా.. కొత్త ఎపిసోడ్ కి సోనమ్‌ కపూర్‌, అర్జున్‌ కపూర్‌ లు హాజరయ్యారు. వాళ్ళు రావడంతోనే తన ప్రశ్నలకు మరింత బోల్డ్ నెస్ ను జోడించాడు కరణ్. అర్జున్‌ను ఉద్దేశిస్తూ సోనమ్‌ ను.. “నీకున్న ఎంతమంది ఫ్రెండ్స్‌తో ఇతడు బెడ్‌ షేర్‌ చేసుకున్నాడు?” అంటూ ఘాటు ప్రశ్న వేశాడు.ఇందుకు ఆమె “దాని గురించి నేను ఇప్పుడు మాట్లాడలేను. అయినా నాకలాంటి బ్రదర్స్‌ లేరు అని బదులిచ్చింది”…. అందుకు కరణ్‌ “మరి ఎలాంటి బ్రదర్స్‌ ఉన్నారు” అంటూ వ్యంగ్యంగా ప్రశ్నించాడు.

ఈ క్రమంలో అర్జున్ ..”అసలు నువ్వెలాంటి సిస్టర్‌వి .. మాకోసం ఏం చెప్తున్నావో తెలుస్తోందా? సోనమ్‌తో ట్రోల్‌ చేయించాలానే ఉద్దేశంతోనే నన్ను ఈ షోకి పిలిచారా.. ఏంటి?” అంటూ ప్రశ్నించాడు. కొంతసేపటి తర్వాత అర్జున్‌ను.. “నీ ప్రియురాలు మలైకా నెంబర్‌ ఏమని సేవ్‌ చేసుకున్నావ్? అని అడిగాడు” కరణ్. ‘నాకు మలైకా అనే పేరే ఇష్టం, కాబట్టి అలాగే సేవ్‌ చేసుకున్నాను’ అంటూ అర్జున్ బదులిచ్చాడు. ఇందుకు సంబంధించిన ప్రోమో ప్రస్తుతం వైరల్ అవుతుంది.

బింబిసార సినిమా రివ్యూ & రేటింగ్!


సీతారామం సినిమా రివ్యూ & రేటింగ్!
చేయని తప్పుకి శాస్త్రవేత్తపై దేశద్రోహి కేసు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus