సినీనటి కరాటే కల్యాణి మరోసారి వార్తల్లో నిలిచారు. అసభ్యకరమైన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన ఫోటోలను మార్ఫ్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారని ఆమె ఫిర్యాదు చేశారు. సెమి న్యూడ్ ఫొటోస్ వైరల్ చేస్తున్నారంటూ హైదరాబాద్ సీసీఎస్ పోలీసులకు కల్యాణి ఫిర్యాదు చేశారు. కరాటే కళ్యాణి ఫిర్యాదుతో 469,506,509 ఐపీసీ సెక్షన్స్ కింద కేసులు నమోదు చేశారు పోలీసులు. లలిత్ కుమార్, ఓంకార్, రవీందర్ రెడ్డి, వేణుగోపాల్, దుర్గారావు,రాం బాబు, నితీష్ గుప్తా, నర్సింహ గౌడ్ లపై కేసులు నమోదు చేశారు పోలీసులు.
తన పాత సినిమా సన్నివేశాల ఫోటోలు మార్ఫింగ్ చేసి వైరల్ చేస్తున్నారు లలిత్ కుమార్ టీం. తన పై తప్పుడు ఆరోపణలు చేస్తూ పరువు భంగం కల్పిస్తున్నారంటూ కరాటే కళ్యాణి ఆవేదన వ్యక్తం చేశారు. తన ఎదుగుదల తట్టుకోలేక సోషల్ మీడియాలో లలిత్ కుమార్ టీం తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆమె అన్నారు. కరాటే కళ్యాణి ఇటీవలే ఖమ్మం ఎన్టీఆర్ విగ్రహం పై పోరాటం చేసి విగ్రహ ఏర్పాటు నిలిపివేసిన విషయం తెలిసిందే.
కృష్ణుడి రూపంలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహాన్ని ఖమ్మంలో భారీ గా ఏర్పాటు చేయనున్నారు. అయితే ఎన్టీఆర్ విగ్రహం దేవుడి రూపంలో ఉండటం పై కరాటే కళ్యాణి అభ్యంతరం వ్యక్తం చేశారు. అదే సమయంలో ఆమెను మా సభ్యతం నుంచి కూడా తొలగించారు. ఇటీవలే తనకు ప్రాణ హాని ఉందని కూడా పోలీసులకు తెలిపింది (Karate Kalyani) కరాటే కళ్యాణి.