Prakash Raj: ప్రకాష్ రాజ్ క్యారెక్టర్ పై నటి సంచలన వ్యాఖ్యలు..?

  • June 24, 2021 / 04:41 PM IST

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు త్వరలో జరగనుండగా ఈ ఎన్నికలకు సంబంధించి ప్రేక్షకుల మధ్య జోరుగా చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. అధ్యక్ష పదవికి నలుగురు సినీ ప్రముఖులు పోటీ చేస్తుండటంతో నలుగురిలో ఎవరు గెలుస్తారనే ప్రశ్నకు వేర్వేరు సమాధానాలు వినిపిస్తున్నాయి. పరభాషా నటుడు అయిన ప్రకాష్ రాజ్ ఈ ఎన్నికల్లో పోటీ చేస్తుండగా ప్రకాష్ రాజ్ వ్యక్తిత్వం గురించి ప్రముఖ నటి కరాటే కళ్యాణి షాకింగ్ కామెంట్లు చేశారు.

తాను ప్రకాష్ రాజ్ కు ఓటు వేయనని కరాటే కళ్యాణి చెప్పుకొచ్చారు. సెట్స్ లో ప్రకాష్ రాజ్ సహాయ నటులతో సరిగ్గా మాట్లాడరని కరాటే కళ్యాణి తెలిపారు. ఒకవేళ సహాయ నటులతో మాట్లాడినా అదోలా ప్రవర్తిస్తూ ఉంటారని ఆమె చెప్పుకొచ్చారు. అందుకు తానే ఉదాహరణ అని కరాటే కళ్యాణి వెల్లడించారు. అలాంటి వ్యక్తిని అధ్యక్షుడిని చేస్తామని చెబితే తానైతే ఒప్పుకోనని కరాటే కళ్యాణి చెప్పారు. తెలుగు నటులే మా అధ్యక్షులు అవ్వాలని తాను భావిస్తున్నానని కరాటే కళ్యాణి పేర్కొన్నారు.

తమిళనాడు సీఎం బాగా పరిపాలన చేస్తున్నారని ఆయనను ఇక్కడ పోటీ చేయిస్తే బాగుంటుందా..? అని కరాటే కళ్యాణి ప్రశ్నించారు. మన నటులు పోటీ చేస్తున్న సమయంలో ఇతర నటులను ఎందుకు సపోర్ట్ చేయాలని కరాటే కళ్యాణి కరాటే కళ్యాణి అన్నారు. మరోవైపు ప్రకాష్ రాజ్ కు చిరంజీవి మద్దతు ఉందని వినిపిస్తుండగా చిరంజీవి నుంచి ఈ మేరకు ప్రకటన రావాల్సి ఉంది.

Most Recommended Video

బాలకృష్ణ మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్.. హిట్లే ఎక్కువ..!
సింహా టైటిల్ సెంటిమెంట్ బాలయ్యకి ఎన్ని సార్లు కలిసొచ్చిందో తెలుసా?
26 ఏళ్ళ ‘పెదరాయుడు’ గురించి ఈ 10 సంగతులు మీకు తెలుసా?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus