Kareena Kapoor: అలా ఉండటమే నా లక్ష్యం.. కరీనా కపూర్ కామెంట్స్ వైరల్!

బాలీవుడ్ ఇండస్ట్రీలో కరీనా కపూర్ (Kareena Kapoor) కు ఊహించని స్థాయిలో క్రేజ్ ఉందనే సంగతి తెలిసిందే. కరీనా కపూర్ భర్త సైఫ్ అలీ ఖాన్ (Saif Ali Khan) మరికొన్ని రోజుల్లో దేవర  (Devara) సినిమాతో అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఈ సినిమా సక్సెస్ సాధిస్తే పాన్ ఇండియా స్థాయిలో జూనియర్ ఎన్టీఆర్ పేరుతో పాటు సైఫ్ అలీ ఖాన్ పేరు సైతం మారుమ్రోగే అవకాశం ఉంది. కరీనా కపూర్ తాజాగా చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Kareena Kapoor

మరికొన్ని రోజుల్లో కరీనా కపూర్ పుట్టినరోజును జరుపుకోనున్నారు. వయస్సు పెరగడం వల్ల కరీనా కపూర్ పై ట్రోల్స్ వస్తుండగా ఆ ట్రోల్స్ గురించి సైతం ఆమె రియాక్ట్ అయ్యారు. నేను చేయాలనుకున్నది చేసేశానని నా పనిని ప్రపంచంలో ప్రతి ఒక్కరూ మెచ్చుకున్నారని కరీనా కపూర్ అన్నారు. హాలీవుడ్ సినిమాలు చేయాలని, ఇంగ్లీష్ సినిమాలలో నటించాలని నటించాలని అనుకోలేదని ఆమె తెలిపారు.

నేను చేసే పనిని సరిగ్గా చేయడంతో పాటు నిజాయితీగా ఉండటమే తన లక్ష్యమని కరీనా కపూర్ అన్నారు. నేను ప్రస్తుతం ఉన్న స్థితిలో సంతోషంగా ఉన్నానని కరీనా కపూర్ వెల్లడించారు. పర్ఫెక్ట్ గా కనిపించాలనే ఒత్తిడి నాపై ఉంటుందని ప్రస్తుతం నేను అన్ని రకాల టెన్షన్స్ ను మరిచిపోయానని కరీనా తెలిపారు. తాను సంతోషకరమైన లైఫ్ ను ఆనందిస్తున్నానని మంచి మార్గంలో ఉండాలనేది నా లక్ష్యమని ఆమె వెల్లడించారు.

నా వయస్సు ప్రస్తుతం 44 ఏళ్లు అని కరీనా కపూర్ పేర్కొన్నారు. నా భర్తకు నేను హాట్ గా కనిపిస్తున్నానని కరీనా కపూర్ చెప్పుకొచ్చారు. వయస్సుకు తగిన రోల్స్ లో నటిస్తున్నానని నా సినిమాలు సైతం సక్సెస్ సాధిస్తున్నాయని ఆమె తెలిపారు. అభిమానులు నన్ను నేనుగా చూడటానికి ఇష్టపడుతున్నారని కరీనా కపూర్ తెలిపారు. కరీనా కపూర్ ను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది.

మనసుల్ని మెలితిప్పే సినిమాకు సీక్వెల్‌.. ఈసారి ఎలా ఉంటుందో?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus