Kareena Kapoor: సౌత్‌ సినిమాలపై కన్నేసి స్టార్‌ కపుల్‌… నెక్స్ట్‌ఎవరొస్తారో?

ఒకప్పుడు మన నటులు, దర్శకులు బాలీవుడ్‌ వెళ్లి అక్కడ నటిస్తే… అదో పెద్ద విషయంలా ఉండేది. ‘మనోడు అక్కడ అదరగొట్టాడు’ అనేవాళ్లం. అయితే ఇప్పుడు పరిస్థితి మారింది. అక్కడి స్టార్లు మన దగ్గరకు వచ్చి సినిమాలు చేస్తున్నారు. ఒకప్పుడు విలన్లు, హీరోయిన్లు మాత్రమే వచ్చేవారు. ఇప్పుడు హీరోలు కూడా వస్తున్నారు. అయితే హీరోయిన్లలో కొత్త భామలే వచ్చేవారు. అయితే ఇప్పుడు అక్కడి స్టార్‌ హీరోయిన్లు కూడా మనదగ్గరకు వస్తున్నారు. ఈ క్రమంలో మొన్నీమధ్య భర్త వస్తే… ఇప్పుడు భార్య కూడా సౌత్‌ సినిమాకు వచ్చేస్తోంది.

ప్రేమకథలు, యాక్షన్‌, కామెడీ.. ఇలా జానర్‌ ఏదైనా ప్రేక్షకుల్ని రంజింపజేసే హీరోయిన్లలో అగ్రకథానాయిక కరీనా కపూర్‌ (Kareena Kapoor) ఒకరు. ఇండస్ట్రీలో అడుగుపెట్టి 17 ఏళ్లు అయినా ఇంకా కొత్త హీరోయిన్‌ అనేలానే కనిపిస్తూ, అలరిస్తుంటుంది. త్వరలో ‘ది క్రూ’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఆ సినిమాలో ఎయిర్‌ హోస్టెస్‌గా సందడి చేయనుంది. మరో ఇద్దరు కథానాయికలతో ఆమె ఆ సినిమాలో నటించింది. అయితే గత కొన్ని రోజులు కరీనా కపూర్‌ ఓ కన్నడ పాన్‌ ఇండియా సినిమాలో నటిస్తోంది అని వార్తలొస్తున్నాయి.

ఈ విషయాన్ని తాజాగా ఆమెనే చెప్పేసింది. ఇటీవల సోషల్‌ మీడియాలో అభిమానులతో మాట్లాడుతూ… తన రాబోయే సినిమా గురించి ఆసక్తికర విషయాలు షేర్‌ చేసుకుంది కరీనా. ‘‘త్వరలోనే నేను ఓ భారీ సినిమాతో దక్షిణాది చిత్రసీమలో అడుగుపెడుతున్నాను. అది పాన్‌ ఇండియా సినిమా. మొదటిసారి ఇలాంటి ఓ సినిమాలో పనిచేస్తున్నాను’’ అని చెప్పింది. దీంతో ఆ సినిమా యశ్‌ (Yash) ‘టాక్సిక్‌’ (Toxic) అని సోషల్‌ మీడియాలో అభిమానులు నిర్ణయించేస్తున్నారు. మరికొందరు అయితే ఇంకేదైనా సినిమా గురించి అలా చెప్పిందేమో అని అంటున్నారు.

‘కేజీయఫ్‌’ సినిమాల తర్వాత యశ్‌ పాన్‌ ఇండియా స్టార్‌ అయిపోయాడు. సగటు హీరోలా ఆలోచిస్తే కుదరదు అని అనుకున్నాడో, లేక వరుస షూటింగ్‌ల నుండి విరామం అనుకున్నాడో కానీ చాలా రోజుల గ్యాప్‌ తీసుకున్నాడు. కొత్త సినిమా గురించి వరుస పుకార్లు వచ్చినా ఎక్కడా క్లారిటీ రాలేదు. సినిమా ఎప్పుడు అని అభిమానులు ఎదురు చూసి ఎదురు చూశాక ఎట్టకేలక గీతూ మోహన్‌దాస్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తానని యశ్‌ ప్రకటించాడు. అదే ‘టాక్సిక్‌’.

రజాకర్ సినిమా రివ్యూ & రేటింగ్!

లంబసింగి సినిమా రివ్యూ & రేటింగ్!
సేవ్ ది టైగర్స్: సీజన్ 2 వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus