లోకేశ్ కనగరాజ్ నుండి ‘విక్రమ్’ అనే సినిమా వచ్చి పాన్ ఇండియా హిట్ కొట్టి.. ఆయన పాన్ ఇండియా డైరక్టర్ అయ్యారు అంటే దానికి పునాది పడిన సినిమా ‘ఖైదీ’. కార్తి హీరోగా రూపొందిన ఈ సినిమా లోకేశ్‌కు చాలా మంచి పేరు తీసుకొచ్చింది. అగ్ర హీరోలను, మాస్ సబ్జెక్ట్‌లను, యాక్షన్ సినిమాలను హ్యాండిల్ చేయగలరు లోకేశ్ అనే భరోసా రావడం వల్లే కమల్ హాసన్, రజనీకాంత్, విజయ్ లాంటి వాళ్లు అవకాశమిచ్చారు. అయితే లోకేశ్ ఆ తర్వాత ఆ స్థాయిలో కంటెంట్ ఇవ్వలేక ఇప్పుడు ఇబ్బంది పడుతున్నారు.
Karthi
‘కూలీ’ సినిమా ఫలితం తర్వాత లోకేశ్ టేకింగ్ మీద చాలామందికి అనుమానాలు వచ్చాయి. అందుకే ఆయన అప్పటివరకు ఓకే చేసుకున్న ప్రాజెక్ట్‌లు సైడ్ అవుతున్నాయి అని గత కొన్ని రోజులుగా వార్తలొస్తున్నాయి. అందుకే లోకేశ్ టాలీవుడ్ వచ్చి ఇద్దరు అగ్రహీరోలు పవన్ కల్యాణ్, అల్లు అర్జున్‌కి కథ చెప్పారని సమాచారం కూడా వచ్చింది. దీంతో కార్తితో లోకేశ్ చేయాల్సిన ‘ఖైదీ’ సినిమా సీక్వెల్ ‘ఖైదీ 2’ ఇప్పుడు ఉండకపోవచ్చు, పూర్తిగా ఉండకపోవచ్చు అనే మాట కూడా వినిపించింది.
ఇప్పుడు కార్తి మాటలు వింటుంటే ఆ పుకార్లే నిజమవుతాయి అనిపిస్తోంది. ‘అన్నగారు వస్తారు’ సినిమా ప్రచారం కోసం కార్తి మీడియా ముందుకు వచ్చినప్పు ఆయనకు ‘ఖైదీ’ సినిమా సీక్వల్ గురించి ప్రశ్న ఎదురైంది. దానికి ఆయన ఏమో తెలియాల్సి ఉంది అనే మాట వాడారు. దీని మీద క్లారిటీ ఉండి ఉంటే.. ఇప్పుడు కాదు కాస్త సమయం పడుతుంది, వచ్చే ఏడాది మొదలవుతుంది. లేదంటే లోకేశ్, నేను వేరే ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాం లాంటి ఆన్సర్‌లు ఇచ్చేవారు. కానీ తెలియదు అనే మాట వాడారు. దీంతో ‘ఖైదీ 2’ ఉండదు అని ఓ అంచనా వస్తోంది.
నిజానికి, ‘ఖైదీ 2’ చాలామంది ఆలోచన. ఆ సినిమాలోని ఢిల్లీ పాత్రకు మంచి స్పందన వచ్చింది. ఆయన గతమేంటి అనేది చూడాలని ఫ్యాన్స్ అనుకున్నారు. కానీ ఆ సినిమా స్టార్ట్ చేయకుండా లోకేశ్ ఇతర సినిమాలవైపు వెళ్లారు. ఈ నేపథ్యంలో కార్తి అలా అన్నారు అనిపిస్తోంది.