తమిళ్ స్టార్ కార్తీ (Karthi) ప్రస్తుతం కెరీర్‌లో ఓ బిజీ ఫేజ్‌లో దూసుకెళ్తున్నాడు. ఒకవైపు వరుసగా విజయాలు అందుకుంటూ, మరోవైపు డిఫరెంట్ జానర్స్ ఎక్స్‌ప్లోర్ చేస్తూ అటు ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి ఇటు మాస్ సెగ్మెంట్ వరకూ ఫ్యాన్ బేస్ పెంచుకుంటున్నాడు. ఇటీవల వచ్చిన ‘సత్యం సుందరం’ (Sathyam Sundaram) మంచి టాక్ తెచ్చుకోగా, ఇప్పుడు రెండు భారీ ప్రాజెక్ట్స్‌తో మళ్లీ స్క్రీన్ మీదకి రాబోతున్నాడు. ఈ మధ్యే షూటింగ్ పూర్తి చేసుకున్న ‘సర్దార్ 2’ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది.
తొలి భాగం ఘనవిజయం సాధించిన నేపథ్యంలో సీక్వెల్‌పై అంచనాలు విపరీతంగా పెరిగాయి. మరోవైపు, కార్తీ పూర్తి మాస్ అవతారంలో కనిపించబోయే ‘వా వాతియార్’ మూవీ కూడా రిలీజ్‌కి సిద్ధమవుతోంది. ఈ రెండు చిత్రాలు 2024లో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇవి కాకుండా కార్తీ తర్వాతి ప్రాజెక్ట్‌లకు సంబంధించిన సమాచారం బాగా హైప్ క్రియేట్ చేస్తోంది.
లోకేష్ కనగరాజ్ (Lokesh Kanagaraj) దర్శకత్వంలో ‘ఖైదీ 2’, హెచ్ వినోధ్‌తో (H. Vinoth) ‘ఖాకీ 2’, గౌతమ్ మేనన్‌తో (Gautham Vasudev Menon) ఓ థ్రిల్లర్ సినిమా, అలాగే పా.రంజిత్ (Pa. Ranjith), మారి సెల్వరాజ్, శివ, సుందర్.సి (Sundar C) వంటి డైరెక్టర్స్‌తో చర్చల్లో ఉన్నట్లు సమాచారం. వీరందరూ ఇప్పటికే కథలు వినిపించగా, ఫ్యూచర్‌లో సెట్స్‌పైకి వెళ్లే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ఇప్పటికే 2025 వరకూ కార్తీ డేట్స్ పూర్తిగా బుక్ అయిపోయాయి. 2026 వరకు కూడా ప్లానింగ్ దాదాపు ఫిక్స్ అయిపోయిందని సమాచారం.
అంటే కార్తీ లైన్‌ప్ చూస్తే మినిమం 5-6 సినిమాలు రెడీగా ఉన్నట్లు అర్థం. పైగా ఇందులో చాలా ప్రాజెక్ట్స్ మల్టీ లాంగ్వేజ్ రిలీజ్‌కి ప్లాన్ అవుతుండటంతో, కార్తీ ఇప్పుడు పాన్ సౌత్ స్టార్‌గా ఎదిగే దిశగా స్పష్టంగా కనిపిస్తోంది. ఇలాంటి స్ట్రాంగ్ లైన్‌ప్‌తో కార్తీ కెరీర్‌లో మరో బిగ్ పీక్ రావడం ఖాయమని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ ప్రాజెక్ట్‌లు పాజిటివ్ టాక్ అందుకుంటే బాక్సాఫీస్ దగ్గర ఖచ్చితంగా బ్లాస్ట్ అవ్వడం ఖాయం.