అల్లు అర్జున్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘అల.. వైకుంఠపురములో’ సినిమా 2020లో విడుదలై భారీ విజయాన్ని అందుకుంది. దీంతో ఈ సినిమాను ‘షెహజాదా’ అనే పేరుతో బాలీవుడ్ లో రీమేక్ చేశారు. కార్తీక్ ఆర్యన్ హీరోగా ఈ సినిమా తెరకెక్కింది. ఇటీవలే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చింది. ‘అల.. వైకుంఠపురములో’ సినిమాతో పోలిస్తే కలెక్షన్స్ పరంగా ఈ సినిమా వెనుకబడిందని తెలుస్తోంది. మొదటిరోజు నుంచే ఈ సినిమాపై జనాలు పెద్దగా ఆసక్తి చూపిస్తున్నట్లుగా లేరు.
ఈ సినిమా రిలీజైన రోజే హాలీవుడ్ సినిమా ‘యాంట్ మ్యాన్ ది వాస్ప్ – క్వాంటమ్ మేనియా’ రిలీజయింది. మార్వెల్ సంస్థ నుంచి వచ్చిన సినిమా కావడం, మొదటి నుంచి మంచి బజ్ ఉండడంతో ప్రేక్షకులు ఈ సినిమా థియేటర్లకే క్యూ కడుతున్నారు. దీంతో వసూళ్ల పరంగా ఈ సినిమా దూసుకుపోతుంది. మొదటిరోజు ‘యాంట్ మ్యాన్’ సుమారుగా రూ.4. 5 కోట్లు సాధించగా.. ‘షెహజాదా’ రూ.2.91 కోట్లు సాధించింది.
తొలిరోజు నుంచే ‘షెహజాదా’ పట్ల ప్రేక్షకుల నుంచి తిరస్కరణ భావం వ్యక్తమైంది. రివ్యూలు కూడా సానుకూలంగా లేవు. నిజానికి ‘అల వైకుంఠపురములో’ సినిమా విపరీతమైన బజ్ రావడంతో నార్త్ జనాలు ఓటీటీలో ఆ సినిమాను చూసేశారు. అందుకే ఇప్పుడు రీమేక్ చూడడానికి పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. ఈ సినిమాపై కార్తీక్ ఆర్యన్, దర్శకనిర్మాతలు చాలా ఆశలు పెట్టుకున్నారు. కానీ బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా జోరు చూపించలేకపోతుంది.
మౌత్ టాక్ బాగుండి ఉంటే కలెక్షన్స్ పుంజుకుంటాయనే ఆశ ఉండేది. అది కూడా జరగడం లేదు. దీన్ని బట్టి సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వడం కష్టమనే అంటున్నారు. ఈ సినిమాలో కృతి సనన్ హీరోయిన్ గా నటించగా.. పరేష్ రావల్, మనీషా కొయిరాలా, రాజ్ పాల్ యాదవ్, రోనిత్ రాయ్ వంటి తారలు కీలకపాత్రలు పోషించారు.
సార్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘గజిని’ మూవీ మిస్ చేసుకున్న హీరోలు ఎవరంటే?
టాప్ 10 రెమ్యూనరేషన్ తెలుగు హీరోలు…ఎంతో తెలుసా ?
కళ్యాణ్ రామ్ నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?