‘కార్తీక దీపంలో’ ఫేమ్ అరుణ్ కుమార్ గురించి మనకు తెలియని విషయాలు..!

ప్రస్తుతం బుల్లితెర పై సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తూ దూసుకుపోతున్న సీరియల్ ఏమైనా ఉందా అంటే.. అది ‘కార్తీక దీపం’ సీరియల్ అనే చెప్పాలి. గత మూడేళ్ళుగా ఈ సీరియల్ కు వస్తున్న టి.ఆర్.పి లు తెలిస్తే ఎవ్వరికైనా షాక్ అవ్వాల్సిందే. ఒక్కో ఎపిసోడ్ కు 15 టి.ఆర్.పి రేటింగ్ వరకూ నమోదు చేస్తుందట ‘కార్తీక దీపం’. ఎంత కొత్త సినిమా లేదా స్టార్ హీరో సినిమాని ఆ ఛానల్ వారు టెలికాస్ట్ చేసినా ఈ స్థాయిలో రేటింగ్ వస్తుందని చెప్పలేము. ఇదిలా ఉండగా.. ఈ సీరియల్లోని నటీనటులు కూడా బాగా పాపులర్ అయ్యారు.

అయితే ఈ సీరియల్లో ఆనంద్ రావు అనే పాత్రలో కనిపించే గడిరాజు అరుణ్ కుమార్.. గతంలో పలు సినిమాల్లో కూడా నటించాడన్న సంగతి బహుశా ఎక్కువ మందికి తెలియకపోవచ్చు. మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన ‘అత్తకు యముడు అమ్మాయికి మొగుడు’ చిత్రంలో హీరోయిన్ విజయశాంతి అన్నయ్యగాను.. అలాగే ‘విజేత’ సినిమాలో కూడా చిరంజీవి చెల్లెలి భర్తగా.. అంటే అందులో కూడా బావగానే కనిపించాడు అరుణ్ కుమార్. ఇక మహేష్ బాబు – త్రివిక్రమ్ కాంబినేషన్లో వచ్చిన.. ‘ఖలేజా’ సినిమాలో చివర్లో డీన్ పాత్రలో కనిపించింది కూడా ఈయనే..! అంతేకాదు శర్వానంద్ – అల్లరి నరేష్- శ్రీయ.. ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ‘నువ్వా నేనా’ అనే చిత్రంలో శర్వానంద్ కు తండ్రిగా కనిపించాడు అరుణ్ కుమారే.

Karthika Deepam fame Ananda Rao appeared in Chiranjeevi Mahesh Babu1

ఇంకా ఎన్నో పాత చిత్రాల్లో నటించాడు. అయితే ఇన్ని సినిమాల్లో నటించినా ఫేమస్ కానీ అరుణ్ కుమార్ ను.. ‘కార్తీక దీపం’ సీరియల్ బాగా పాపులర్ అయ్యేలా చేసింది. అయితే ఈ సీరియల్లో గత కొన్ని ఎపిసోడ్ల నుండీ ఈయన పాత్ర కనిపించడం లేదు. లాక్ డౌన్ కారణంగా కలకత్తాలో ఇరుక్కుపోయినట్టు.. అర్చన(భార్య సౌందర్య) పాత్ర చేత చెప్పించి.. అప్పుడప్పుడు ఫోన్లు చేస్తున్నట్టు చూపిస్తున్నారు. నిజానికి కరోనా టైంలో షూటింగ్ చెయ్యడం రిస్క్ అని భావించి.. ఈయనే దూరంగా ఉంటున్నాడని సమాచారం.

1

2

3

Most Recommended Video

బిగ్‌బాస్ 4 కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!
బిగ్‌బాస్‌ 4 హైలెట్స్: ఏడుపులు.. అలకలు.. ఆగ్రహాలు.. ఆవేశాలు!
బిగ్ బాస్ 4 నామినేషన్: కిటికీల ఆటలో తలుపులు మూసేసింది ఎవరికంటే?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus