Karthikeya: నన్ను, అమ్మను రాజమౌళి అక్కడికి తీసుకెళ్లేవారు.. కార్తికేయ కామెంట్స్ వైరల్!

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ఊహించని స్థాయిలో సక్సెస్ కావడం వెనుక ఆయన కుటుంబం కష్టం ఎంతో ఉంది. రాజమౌళికి భార్య రమ, కొడుకు కార్తికేయ నుంచి లభిస్తున్న సపోర్ట్ అంతాఇంతా కాదు. తాజాగా కార్తికేయ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ రాజమౌళి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అప్పుడు నా 8 సంవత్సరాలు అని ప్రతిరోజూ జక్కన్న ఇంటికొచ్చేవారని నన్ను, అమ్మను డిన్నర్ కు తీసుకెళ్లేవారని కార్తికేయ తెలిపారు. రాజమౌళి కీరవాణి సోదరుడిగా నాకు ముందునుంచి తెలుసని ఏడాదిలోనే రాజమౌళి నాకు దగ్గరయ్యారని ఆయన చెప్పుకొచ్చారు.

రాజమౌళి ఒక్కరోజు ఇంటికి రాకపోయినా ఎందుకు రాలేదని అడిగేవాడినని అంత క్లోజ్ నెస్ నాకు వచ్చిందని అప్పటికే నా మైండ్ లో కొన్ని విషయాలు ఫిక్స్ అయ్యానని కార్తికేయ అభిప్రాయం వ్యక్తం చేశారు. అమ్మతో పెళ్లికి ముందే బాబా నా ఫాదర్ అని ఫిక్స్ అయ్యానని కార్తికేయ చెప్పుకొచ్చారు. అమ్మ రాజమౌళి పెళ్లి జరిగిన తర్వాత ఇదే కదా జరగాల్సింది అని అనిపించిందని కార్తికేయ కామెంట్లు చేశారు. పెళ్లి తర్వాత ఒక కంప్లీట్ ఫ్యామిలీ అనే భావన వచ్చిందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.

అమ్మ, బాబా పెళ్లి చేసుకుంటామని చెప్పక ముందే వాళ్లిద్దరి పెళ్లి జరుగుతుందని నేను ఫిక్స్ అయ్యానని కార్తికేయ చెప్పుకొచ్చారు. నేను రాజమౌళిని బాబా అని పిలుస్తానని కార్తికేయ కామెంట్లు చేశారు రాజమౌళిని బాబా అని పిలిచినా మైండ్ లో తండ్రి ఆయనేనని కార్తికేయ చెప్పుకొచ్చారు. రాజమౌళి ఏది మొదలుపెట్టి నా అంతు చూసేవరకు వదలరని జక్కన్న నుంచి ఆ లక్షణాన్ని నేను కూడా నేర్చుకున్నానని కార్తికేయ తెలిపారు.

కార్తికేయ (Karthikeya) రాజమౌళి సినిమాలకు సంబంధించిన అన్ని వ్యవహారాలను దగ్గరుండి చూసుకుంటారు. ఆర్.ఆర్.ఆర్ కు ఆస్కార్ రావడంలో కార్తికేయ కష్టం అంతాఇంతా కాదు. జక్కన్న ఇతర డైరెక్టర్లకు సైతం షాకిచ్చేలా సక్సెస్ రేట్ ను కలిగి ఉన్నారు.

శాకుంతలం సినిమా రివ్యూ & రేటింగ్!
అసలు పేరు కాదు పెట్టిన పేరుతో ఫేమస్ అయినా 14 మంది స్టార్లు.!

బ్యాక్ టు బ్యాక్ ఎక్కువ ప్లాపులు ఉన్న తెలుగు హీరోలు ఎవరంటే?
పూజా హెగ్డే కంటే ముందు సల్మాన్ ఖాన్ తో డేటింగ్ చేసిన 13 మంది హీరోయిన్లు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus