బాలీవుడ్ మేకర్స్ కు సినిమాలు తీయడం చేత కావట్లేదా?

  • January 15, 2023 / 11:17 AM IST

అల్లు అర్జున్‌ నటించిన సినిమా అలవైకుంఠపురములో.. చిత్రం ఎంతటి హిట్‌ కొట్టిందో ప్రత్యేకంగా చెప్పనసరం లేదు. టాలీవుడ్‌లో స్టైలిష్ స్టార్‌గా ఎదిగిన అల్లు అర్జున్‌ కెరీర్‌లో ఉత్తమ చిత్రాల్లో ఒకటిగా ఈ మూవీ నిలిచిపోయింది. త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ డైరెక్షన్‌లో వచ్చిన ఈ మూవీ.. తెలుగులో బ్లాక్‌ బస్టర్‌ కొట్టింది. ముఖ్యంగా అల్లు అర్జున్ లోని స్టైల్‌ను దృష్టిలో పెట్టుకొని త్రివిక్రమ్ తన మార్క్ డైలాగులతో ఈ చిత్రాన్ని తీశారు. ఇందులో ఊహించని ట్విస్టులు పెట్టకుండా కథను స్ట్రెయిట్‌గా చెబుతారు.

అలవైకుంఠపురములో సినిమా తర్వాత అల్లు అర్జున్‌ స్థాయి పెరిగింది. ఈ మూవీలో బంటుగా బన్నీ చేసిన యాక్షన్‌ అన్ని వర్గాలనూ ఆకట్టుకుంది. ప్రేక్షకుల మదిలో ఈ చిత్రం ఉండిపోయింది. అయితే, ఇదే సినిమాను ఇప్పుడు హిందీలో డబ్‌ చేస్తున్నారు. షెహజాదా పేరుతో తాజాగా ట్రైలర్‌ కూడా రిలీజ్‌ చేసింది చిత్ర బృందం. కార్తీక్ ఆర్యన్ హీరోగా నటిస్తున్నాడు. హీరోగా కార్తీక్ ఆర్యన్ అప్పియరెన్స్‌ బాగానే ఉంది. కానీ కానీ ఇతను మన అల వైకుంఠపురములో సినిమాలోని బన్నీ క్యారెక్టర్‌ చేస్తున్నాడంటేనే కాస్త ఎబ్బెట్టుగా కనిపిస్తోంది.

సినిమాకు బ్యాగ్రౌండ్‌ స్కోర్‌ మైనస్‌గా మారింది. అల వైకుంఠపురములో సినిమాలో ఉండే మ్యాజిక్, షెహజాదా ట్రైలర్‌లో కనిపించడం లేదని అభిమానులు చర్చించుకుంటున్నారు. రెండు ట్రైలర్లకూ పోలికే లేదు.. అల్లు అర్జున్‌ను మ్యాచ్‌ చేయడానికి ఈ హీరో చాలా కష్టపడ్డాడు కానీ ఫలితం లేకపోయింది. సీన్స్ ని మ్యాచ్ చెయ్యడానికి ట్రై చేశారు కానీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కాస్తా ఓవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అయ్యిందని కామెంట్లు పెడుతున్నారు.

షెహజాదా ట్రైలర్ చూసిన తర్వాత బాలీవుడ్ వాళ్లు మన సినిమాలని రీమేక్ చెయ్యడం ఆపేస్తే బెటర్ అని అభిప్రాయపడుతున్నారు. ఈ రెండు ట్రైలర్స్‌ను పక్కపక్కన పెట్టుకొని చూస్తే ఈ విషయం ఎవరికైనా ఇట్టే అర్థమైపోతుందని చెబుతున్నారు.

వీరసింహారెడ్డి సినిమా రివ్యూ & రేటింగ్!
వాల్తేరు వీరయ్య సినిమా రివ్యూ & రేటింగ్!

‘ఆంధ్రావాలా’ టు ‘అజ్ఞాతవాసి’ .. సంక్రాంతి సీజన్లో మర్చిపోలేని డిజాస్టర్ గా సినిమాల లిస్ట్..!
తలా Vs దళపతి : తగ్గేదేలే సినిమా యుద్ధం – ఎవరిది పై చేయి?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus