నెట్లోకి వచ్చిన కాటమరాయుడు క్లైమాక్స్ సీన్
- February 28, 2017 / 10:33 AM ISTByFilmy Focus
స్టార్ హీరోలతో సినిమాలు తీయడం ఎంతో కష్టమనుకుంటే.. ఆ చిత్రం రిలీజ్ అయ్యే వరకు లీక్ కాకుండా కాపాడుకోవడం మరింత కష్టమయిపోతోంది. పెరిగిన టెక్నాలజీ దర్శకులు, నిర్మాతలకు నిద్రలేకుండా చేస్తున్నాయి. చిత్ర యూనిట్ సభ్యులే వీడియోలను లీక్ చేసి బాధ కలిగిస్తున్నారు. కొన్ని రోజుల క్రితం బాహుబలి కంక్లూజన్ లోని యుద్ధ సీక్వెన్స్ ని నెట్లో అప్లోడ్ చేసిన సంఘటన నుంచి చిత్ర పరిశ్రమ తేరుకోక ముందో మరో స్టార్ హీరో మూవీ లీక్ బారిన పడింది. సర్దార్ గబ్బర్ సింగ్ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేస్తున్న కాటమరాయుడు సినిమాలో క్లైమాక్స్ ఫైట్ ఇప్పుడు అందరి అరచేతిలోకి వచ్చింది. డాలీ దర్శకత్వంలో నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్స్ పై శరత్ మరార్ నిర్మిస్తున్న ఈ మూవీ షూటింగ్ చివరి దశకు చేరుకుంది.
ఉగాది కానుకగా మార్చి 24 న రిలీజ్ చేసేందుకు పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో నిమగ్నమైన డాలీ బృందానికి వీడియోలు లీక్ కావడం షాక్ కి గురిచేసింది. ఎవరి లీక్ చేశారో తెలియక యూనిట్ సభ్యులు తలపట్టుకుంటున్నారు. మళ్ళీ అటువంటి పొరపాటు జరగకుండా నిర్మాత గట్టి చర్యలు చేపట్టారు. గతంలో పవన్ కళ్యాణ్ మూవీ అత్తారింటికి దారేది లీకైంది. ఎవ్వరూ ఊహించనట్టుగా సూపర్ హిట్ అయింది. కాటమరాయుడు కూడా లీకైంది. సో ఇది కూడా బ్లాక్ బస్టర్ అవుతుందని పవన్ ఫ్యాన్స్ భావిస్తున్నారు.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

















