చిరంజీవి 150 వ సినిమా. రెండేళ్లుగా చిరంజీవి అభిమానులను ఊరిస్తున్న మాట, ఎలాగో అన్ని అడ్డంకులను దాటుకుని సినిమాకు పూజా కార్యక్రమాలను పూర్తి చేశారు. అయినా షూటింగ్ మొదలు కాలేదు. తొందరగా మొదలు పెడదామని నిర్మాత రామ్ చరణ్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తాను నటిస్తున్న సినిమాను పక్కన పెట్టడానికి నిర్ణయించుకున్నాడు. అయినా మరో నెల పాటు పోస్ట్ పోన్ అయింది. దీంతో చరణ్ తన మూవీ షూటింగ్ కి వెళ్ళిపోయాడు. ఇప్పుడు కత్తిలాంటోడు చిత్రం డైరెక్టర్ వి వి వినాయక్ సెట్ పనులను దగ్గరుండి చూస్తున్నాడు. అంతేకాదు పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఎలా ఉండాలో ఇప్పుడే ప్లాన్ చేస్తున్నారు. టెక్నికల్ టీం కూడా ప్రొడక్షన్ టైం లో షూటింగ్ స్పాట్ కి రానున్నట్లు సమాచారం. ఈ జాగ్రత్తలు చూస్తుంటే హడావిడిగా సినిమాను తీయాలని అనుకోవడం లేదు. స్క్రిప్ట్ వర్క్ కే ఏడాది తీసుకున్నారు. పరుచూరి బ్రదర్స్ రాసిన కథ గమనం, మాటలకు చిరు పూర్తిగా సంతృప్తి అయినప్పుడే ప్రొడక్షన్ మొదలు పెట్టారు.
మ్యూజిక్ కూడా అదిరిపోవాలని మెగాస్టార్ స్వయంగా మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్ తో కలిసి ఈరోజు నుంచి సిట్టింగ్ వేసారు. దీంతో దేవి బాగా సంతోషంగా ఉన్నాడు. “బాస్150 సినిమా కోసం తొలి డిస్కసన్. వెల్కం బ్యాక్ సార్. వుయ్ లవ్ వు సార్” అని ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు.
చిరు శంకర్ దాదా ఎంబీబీఎస్, శంకర్ దాదా జిందాబాద్, అందరివాడు సినిమాలకు దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించాడు. అందరివాడు పాటలు పెద్దగా హిట్ కాకా పోయినా శంకర్ దాదా ఎంబీబీఎస్, శంకర్ దాదా జిందాబాద్ చిత్రాల్లోని పాటలు మాస్ ని క్లాస్ ని ఊపేసాయి. ఈ రెండు సినిమాలకు దేవి పాటలు కూడా రాసాడు. మరి కత్తిలాంటోడు మూవీకి పెన్ పడుతాడా ? వేచి చూడాలిసిందే.