Katrina Kaif pregnant: కత్రీనా కైఫ్ ప్రెగ్నెన్సీ మేటర్లో నిజమెంత..వైరల్ అవుతున్న వీడియో..!

2021 నవంబర్ 9న బాలీవుడ్ లవ్ బర్డ్స్ అయిన కత్రినా కైఫ్-విక్కీ కౌశల్ లు వివాహ బంధంతో ఒక్కటైన సంగతి తెలిసిందే. చాలా కాలం డేటింగ్ తర్వాత వీరు పెళ్లి చేసుకుని కొత్త లైఫ్ ను స్టార్ట్ చేశారు. రాజస్థాన్ లోని సవాయ్ మాధోపూర్ లోని విలాసవంతమైన హోటల్ సిక్స్ సెన్సెస్ ఫోర్ట్ బార్వారా లో వీరి పెళ్లి వేడుకలు ఘనంగా జరిగాయి. వీరి పెళ్ళై 6 నెలలు గడుస్తున్న నేపథ్యంలో కత్రీనా కైఫ్ ప్రెగ్నెంట్ అయ్యిందా?

అనే ఊహాగానాలు ఇప్పుడు ఎక్కువయ్యాయి. విషయంలోకి వెళ్తే.. ఈ మధ్యనే పలు వెకేషన్స్‌కు వెళ్లి వచ్చిన ఈ జంట త్వరలోనే తల్లిదండ్రులు కాబోతున్నారనే డిస్కషన్లు ఇప్పుడు సోషల్ మీడియాలో జోరందుకున్నాయి. దీనికి కారణం కూడా ఉంది.. తాజాగా ఎయిర్‌పోర్టులో దర్శనమిచ్చిన కత్రినా కైఫ్ కొంచెం బొద్దుగా కనిపిస్తుంది. అందుకే నెటిజన్లు ఇలా స్పందిస్తున్నారు అని స్పష్టమవుతుంది. అందుకు సంబంధించిన ఓ వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఆ వీడియోని చూసిన నెటిజన్లు.. ‘ఓ మై గాడ్.. కత్రీనా ప్రెగ్నెంట్‌లా ఉంది’ ,’త్వరలో కత్రినా తల్లి కాబోతుంది అనుకుంట’ ‘కత్రీనా పాపను చూడాలని నాకు ఎంతో ఆతృతగా ఉంది’ అంటూ కామెంట్లు పెడుతున్నారు. కత్రీనా నిజంగానే ప్రెగ్నెంటా ? లేకుంటే ఆమె ధరించిన డ్రెస్‌ వల్ల అలా కనిపిస్తుందా.? అనేది అంతు చిక్కని ప్రశ్న. మరి ఈ ఊహాగానాల పై కత్రినా కైఫ్ ఎలా స్పందిస్తుందో తెలియాల్సి ఉంది. ఇదిలా ఉండగా..

కత్రీనా కైఫ్ తిరిగి టాలీవుడ్ కు రీ ఎంట్రీ ఇవ్వబోతుంది అంటూ ఇటీవల కథనాలు వినిపించిన సంగతి తెలిసిందే. కానీ వీటిని కత్రీనా ఖండించింది. గతంలో ఈమె ‘మల్లీశ్వరి’ ‘అల్లరి పిడుగు’ వంటి చిత్రాల్లో నటించింది.

‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ నుండీ అదిరిపోయే 20 డైలాగులు..!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
‘ప్రతిఘటన’ తో గోపీచంద్ తండ్రి టి.కృష్ణ దర్శకత్వం వహించిన సినిమాల లిస్ట్..!
5 ఏళ్ళ కెరీర్ లో రష్మిక మందన మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus