కయాడు లోహార్ (Kayadu Lohar )… రెండు మూడు రోజుల నుండి ఈ పేరు మార్మోగిపోతోంది. సోషల్ మీడియాలో ఈమె గురించి కొంతమంది చర్చలు జరపడం మాత్రమే కాదు మాటల యుద్దానికి కూడా రెడీ అయిపోయారు. దీంతో ఈ అమ్మడి పేరుపై ఉన్న హ్యాష్ ట్యాగ్ తెగ ట్రెండ్ అవుతుంది. ‘రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్’ (Return of the Dragon) సినిమాలో ఈమె హీరోయిన్ గా నటించిన సంగతి తెలిసిందే. ఆ సినిమాలో మరో హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran) కూడా నటించింది.
కానీ కయాడు లోహర్ కే ఎక్కువ మార్కులు పడ్డాయి. ఈమె గ్లామర్ కి హావభావాలకు యూత్ ఫిదా అయిపోయారు. దీంతో ‘ప్రేమలు’ (Premalu) తో పాపులర్ అయిన మమిత బైజు (Mamitha Baiju)… కయాడు లోహర్ ముందు జుజుబీ అంటూ కామెంట్లు చేస్తున్న వారు సైతం ఉన్నారు. అయితే బాధాకరమైన విషయం ఏంటంటే…కయాడు లోహర్, తమిళంలో కంటే ముందుగా తెలుగులో ఓ సినిమా చేసింది.
2022 లో శ్రీవిష్ణు (Sree Vishnu) హీరోగా ‘అల్లూరి’ (Alluri) అనే సినిమా వచ్చింది. ఇందులో కయాడు లోహర్ మెయిన్ హీరోయిన్. బెక్కం వేణుగోపాల్ ఈ చిత్రానికి ఒక నిర్మాతగా వ్యవహరించారు. సినిమాకి పాజిటివ్ టాక్ వచ్చింది. కానీ బాక్సాఫీస్ వద్ద నిలబడలేదు. బహుశా అందువల్లే అనుకుంట.. ఈమెకి రావాల్సిన గుర్తింపు రాలేదు.
కానీ ‘లవ్ టుడే’ (Love Today) హీరో లేటెస్ట్ మూవీ ‘రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్’ హిట్ అవ్వడం కయాడుకి కలిసొచ్చినట్టు అయ్యింది. ఈ సినిమాలో సినిమాటోగ్రాఫర్ తన ఫోకస్ ఎక్కువగా ఈమె పైనే పెట్టాడు. అది ఆమెకు బాగా కలిసొచ్చినట్టు అయ్యింది. అయితే ఈమె హవా సోషల్ మీడియాలో ఎన్నాళ్ళు నడుస్తుందో చూడాలి.