మార్చి 29న విడుదలవుతున్న ఉద్యమ సింహం

మీరు విన్నది నిజమే. నిజంగానే తెలంగాణ ముఖ్యమంత్రి కె.సి.ఆర్ జీవితం ఆధారంగా రూపొందిన “ఉద్యమ సింహం” అనే చిత్రం మార్చి 29 అనగా ఈ శుక్రవారం విడుదలవుతోంది. ఈమేరకు ఆల్రెడీ పబ్లిసిటీ మొదలెట్టడం మరియు హోర్డింగ్స్ పెట్టడం కూడా స్టార్ట్ చేశారు. పోస్టర్ మీద ఉన్న ఆర్టిస్ట్ యంగ్ కేసీయార్ లాగే ఉన్నాడు చూడ్డానికి. ట్రైలర్ & ప్రోమోస్ చూస్తుంటే తెలంగాణకు ప్రత్యేక రాష్ట్రం తీసుకురావడం కోసం కె.సి.ఆర్ చేసిన పోరాటం ఆధారంగా సినిమా తెరకెక్కించారని అర్ధమవుతోంది.

కాకపోతే.. ఈ బయోపిక్ ను కనీసం టి.ఆర్.ఎస్ పార్టీ వాళ్ళు కూడా సపోర్ట్ చేయడం లేదు. ఆ పోస్టర్స్ చూసే వరకూ సినిమా రిలీజ్ అవుతుందనే విషయం జనాలకి కూడా తెలియలేదు. తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్న కె.సి.ఆర్ బయోపిక్ విడుదలవుతుంటే కనీస స్థాయి బజ్ కూడా లేదు. మరి విడుదలయ్యాకైనా ఈ సినిమాని ఎవరైనా పట్టించుకొంటారో లేదో చూడాలి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus