తరుణ్ భాస్కర్.. ‘పెళ్ళిచూపులు’ చిత్రంతో డైరెక్టర్ గా ఎంట్రీ ఇచ్చాడు. చాలా తక్కువ బడ్జెట్లో తీసిన ఈ సినిమా ఎవ్వరూ ఊహించని విధంగా పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యింది. పెట్టిన బడ్జెట్ కి 10 రెట్లు లాభాలను అందించింది. ఆ తర్వాత ‘ఈ నగరానికి ఏమైంది’ అనే యూత్ ఫుల్ మూవీని తీశాడు. ఇది ఫస్ట్ రిలీజ్ లో అంతంత మాత్రమే ఆడింది. కానీ సెకండ్ రిలీజ్ లో మాత్రం బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇది సేఫ్ ప్రాజెక్ట్ అయినప్పటికీ థియేట్రికల్.. పరంగా హిట్ సినిమా అని చెప్పలేము.
ఇప్పుడు ‘కీడా కోలా’ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు తరుణ్ భాస్కర్. ఈ సినిమాలో తరుణ్ భాస్కర్ కూడా ఓ ముఖ్య పాత్ర పోషించాడు. నవంబర్ 3న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇటీవల రిలీజ్ అయిన ట్రైలర్ కి కూడా మంచి మార్కులు అయితే పడ్డాయి. ఇదిలా ఉండగా.. గత రెండు రోజుల నుండి ఈ సినిమా ప్రీమియర్స్ కొన్ని చోట్ల వేయడం జరిగింది.
సినిమా చూసిన వారు.. తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. ‘ఓ కూల్ డ్రింక్ లో బొద్దింక ఉంటుంది. దానిని చూపించి కేసు వేస్తే కోట్లు వస్తాయని నమ్మే ఇద్దరు కుర్రాళ్ళు.. ఈ ప్రాసెస్ లో ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నారు. పొలిటికల్ గా, కార్పొరేట్ కంపెనీల పరంగా.. వీరి పై ఎలాంటి ఒత్తిడి వచ్చింది’ అనే పాయింట్ తో సినిమా రూపొందినట్లు తెలుస్తుంది.
ఫస్ట్ హాఫ్ స్టార్టింగ్ పోర్షన్ చాలా స్లోగా ఉందట. సెకండ్ హాఫ్ లో యూత్ ని ఆకట్టుకునే అంశాలు ఉంటాయని తెలుస్తుంది. అయితే కామెడీ పోర్షన్స్ బాగా వర్కౌట్ అయ్యాయట. తరుణ్ భాస్కర్, జీవన్ ల నటన హిలేరియస్ గా ఉంటుందని అంటున్నారు. మొత్తంగా ‘పెళ్ళిచూపులు’ ‘ఈ నగరానికి ఏమైంది?’ సినిమాలతో పోల్చుకోకుండా చూస్తే.. ‘కీడా కోలా’ (Keedaa Cola) నచ్చే అవకాశాలు ఉన్నాయని అంతా అంటున్నారు. చూడాలి మరి అది ఎంత వరకు నిజమవుతుందో..!