Sri Simha: కీరవాణి తనయుడి ఎంగేజ్మెంట్.. ఆ అమ్మాయి ఎవరంటే..?

ఎంఎం కీరవాణి  (M. M. Keeravani)  తనయుడు, యువ హీరో శ్రీసింహ (Sri Simha Koduri) తాజాగా ఎంగేజ్మెంట్ వేడుకతో కొత్త జీవితానికి శ్రీకారం చుట్టాడు. ఈ వేడుక రాజమౌళి(Rajamouli) , కీరవాణి కుటుంబ సభ్యులు, సీనియర్ నటుడు నరేష్(Naresh), పవిత్రతో (Pavitra Lokesh)  పాటు మరికొందరు సినీ ప్రముఖుల సమక్షంలో గ్రాండ్‌గా జరిగింది. శ్రీసింహ పెళ్లి చేసుకోబోయే అమ్మాయి పేరు మాగంటి రాగ. ఆమె సీనియర్ నటుడు మురళీమోహన్  (Murali Mohan)  మనవరాలు. మాగంటి రాగ – రామ్ మోహన్, రూప దంపతుల కుమార్తె.

Sri Simha

రాజమౌళి, మురళీమోహన్ కుటుంబాల మధ్య ఉన్న స్నేహబంధం ఈ వివాహానికి కారణమై ఉండవచ్చని అందరూ భావిస్తున్నారు. శ్రీసింహ, రాగల పెళ్లి పెద్దలు కుదిర్చిన సంబంధమా లేక ప్రేమ వివాహమా అనేది ఇంకా స్పష్టత లేదు. అయితే ఈ జంట ఎంతో కాలంగా పరిచయంతోనే ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu)  ప్రత్యేకంగా ఈ వేడుకకు హాజరై శ్రీసింహ, రాగను ఆశీర్వదించాడు.

శ్రీసింహ చైల్డ్ ఆర్టిస్ట్ గానే సినీ ప్రపంచంలో ఉన్నాడు. చైల్డ్ ఆర్టిస్ట్‌గా మొదలైన అతని ప్రయాణం మత్తు వదలరా చిత్రంతో హీరోగా మారింది. ఆ మూవీ ఘనవిజయం సాధించగా, ఆ తర్వాత వచ్చిన తెల్లవారితే గురువారం, భాగ్ సాలే (Bhaag Saale), ఉస్తాద్ (Ustaad) వంటి చిత్రాలు ఆశించిన స్థాయిలో విజయాన్ని అందించలేకపోయాయి. తాజాగా మత్తు వదలరా 2 (Mathu Vadalara 2)చిత్రంతో మరోసారి ప్రేక్షకులను ఆకట్టుకుని హిట్ సాధించాడు.

ఇటీవల కొన్ని ఇంటరెస్టింగ్ ప్రాజెక్టులు లైన్‌లో పెట్టిన శ్రీసింహ, తన కెరీర్‌ను మరింత స్థిరపరచుకోవాలని చూస్తున్నాడు. మరోవైపు, కీరవాణి ‘SSMB29’తో పాటు చిరంజీవి (Chiranjeevi)  ‘విశ్వంభర’ (Vishwambhara)  సినిమాలకు సంగీతం అందించడంలో బిజీగా ఉన్నారు. హడావిడిలేకుండా అతికొద్ది మంది కుటుంబ సమక్షంలో శ్రీసింహ వేడుకను పూర్తి చేశారని తెలుస్తోంది. ఇదిలా ఉంటే, శ్రీసింహ (Sri Simha) , మాగంటి రాగ వివాహం త్వరలోనే జరుగనుందని, ఈ వేడుక టాలీవుడ్‌లో మరొక గ్రాండ్ ఈవెంట్‌గా నిలవనుందని సమాచారం.

పుష్ప 2లో అరగుండు తారక్.. అదే అసలు ట్విస్ట్

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus