Keerthi Bhat: కుమారి ఆంటీ వీడియో కామెంట్స్ పై కీర్తి భట్ రియాక్షన్.. నష్టం లేదంటూ?

కొన్ని వారాల క్రితం బిగ్ బాస్ బ్యూటీ కీర్తి భట్ కుమారి ఆంటీ హోటల్ లో ఫుడ్ అస్సలు బాలేదని కామెంట్ చేయగా ఆ కామెంట్లు నెట్టింట వైరల్ అయిన సంగతి తెలిసిందే. అయితే కుమారి ఆంటీ ఫుడ్ గురించి నెగిటివ్ కామెంట్లు చేయడంతో రివర్స్ లో ఆమెను చాలామంది ట్రోల్ చేయడం జరిగింది. కీర్తి భట్, విజయ్ కార్తీక్ ఈ ట్రోల్స్ ఎక్కువ కావడంతో మేము ఫుడ్ టేస్ట్ చేసి ఉన్నది ఉన్నట్లు చెప్పామని అలా చెప్పడం కూడా తప్పా అంటూ కామెంట్లు చేశారు.

మేము బాధ పడే విధంగా నెటిజన్ల నుంచి నెగిటివ్ కామెంట్లు వస్తున్నాయని కీర్తి భట్ అభిప్రాయపడ్డారు. హోటల్ నుంచి తెచ్చుకున్న ఫుడ్ లో కారం ఎక్కువైతే కర్ణాటకకు వెళ్లండి అని కామెంట్ చేస్తున్నారని మాది రాయలసీమ అని మేము కూడా కారం ఎక్కువగానే తింటామని ఆమె అభిప్రాయపడ్డారు. మేము చేసిన వీడియోను పూర్తిగా చూసి అభిప్రాయాలను పంచుకోవాలని కీర్తి భట్ కోరారు.

మేము చికెన్ కూర రుచి గురించి కామెంట్ చేశామే తప్ప కారం గురించి ఎక్కడా కామెంట్ చేయలేదని ఆమె పేర్కొన్నారు. మేము మా అభిప్రాయాలను పంచుకోవడం ద్వారా కుమారి ఆంటీ బిజినెస్ కు ఏమైనా నష్టం వాటిల్లిందా? అని రివర్స్ లో కీర్తి భట్ ప్రశ్నించారు. ఇష్టానుసారం కామెంట్స్ చేసేవాళ్లు ఆలోచించాలని కీర్తి భట్ పేర్కొన్నారు. కీర్తి భట్ కు సోషల్ మీడియాలో ఫ్యాన్ ఫాలోయింగ్ పెరుగుతోంది.

కుమారి ఆంటీ అభిమానులు మాత్రం కీర్తి భట్ చేసింది రైట్ కాదని అభిప్రాయపడ్డారు. సెలబ్రిటీలు ఫుడ్ బిజినెస్ గురించి నెగిటివ్ కామెంట్లు చేయడం వల్ల బిజినెస్ పై ప్రభావం పడుతుందని నెటిజన్లు చెబుతున్నారు. కొన్నిసార్లు వంటకాలు రుచిగా ఉంటాయని మరి కొన్నిసార్లు రుచిగా ఉండవని అంత మాత్రాన నెగిటివ్ కామెంట్లు చేయడం సరికాదని అభిమానులు వెల్లడిస్తున్నారు.
.

సైలెంట్ గా పెళ్లి పీటలెక్కిన ‘బిగిల్’ నటి ఇంద్రజ..!

కర్ణాటకలో సినిమాలు బ్యాన్‌ అంటున్నారు… మన దగ్గరా అదే చేస్తారా?
ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో రిలీజ్ కాబోతున్న 18 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus