Keerthy Suresh: మహేష్ కూతురి ఛాలెంజ్.. ‘మహానటి’ పెర్ఫార్మన్స్!

ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా వేదికగా ఛాలెంజ్ లు విసురుకోవడం కామన్ అయిపోయింది. ఇప్పుడు మరో కొత్త ఛాలెంజ్ ను క్రియేట్ చేశారు. సూపర్ స్టార్ మహేష్ బాబు ‘సర్కారు వారి పాట’ అనే సినిమాలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఇటీవల సినిమాలో ఫస్ట్ సింగిల్ ను రిలీజ్ చేశారు. ‘కళావతి’ అంటూ సాగే ఈ పాట యూట్యూబ్ లో రికార్డులు సృష్టించింది. ఈ పాటకు మహేష్ బాబు కూతురు సితార స్టెప్పులేసి ఆ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది.

Click Here To Watch

అంతేకాదు.. కళావతి ఛాలెంజ్ పేరుతో ఈ పాటకి పెర్ఫార్మ్ చేసి వీడియోలను పోస్ట్ చేస్తే.. తన ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ లో పోస్ట్ చేస్తానని చెప్పింది. ఇక ఈరోజు ‘సర్కారు వారి పాట’ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోన్న కీర్తి సురేష్ ఈ పాటకు స్టెప్పులేసింది. ఈ వీడియోను కీర్తి సురేష్ తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేయగా.. అది వైరల్ గా మారింది. స్టెప్స్ అదిరిపోయాయంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు.

‘గీతగోవిందం’ ఫేమ్ పరశురామ్ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమా నిర్మాణంలో మహేష్ బాబు కూడా భాగమయ్యారు. యాక్షన్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతోన్న ఈ సినిమాకి తమన్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. నిజానికి సంక్రాంతి కానుకగా ఈ సినిమాను విడుదల చేయాలనుకున్నారు. కానీ ఇప్పుడు మే 12న రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. త్వరలోనే ఈ సినిమా నుంచి మరిన్ని పాటలు విడుదల కానున్నాయి.

తమిళంలో సత్తా చాటిన తెలుగు సినిమాలు … టాప్ 10 లిస్ట్ ఇదే ..!

Most Recommended Video

బ్రహ్మానందం కామెడీతో హిట్టైన 10 సినిమాల లిస్ట్..!
సెలబ్రిటీ కపుల్స్ నయా ట్రెండ్.. ‘సరోగసీ’..!
చైసామ్, ధనుష్- ఐస్ లు మాత్రమే కాదు సెలబ్రిటీల విడాకుల లిస్ట్ ఇంకా ఉంది..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus