ఒక సినిమా హిట్ అయ్యిందంటే… అందులో హీరో,హెరోయిన్లు బాగా హైలెట్ అవుతారు. హీరోయిన్ విషయంలో మాత్రం ఆ చిత్రంలో క్యారెక్టర్… లేదా టైటిల్ రోల్ పోషిస్తే ఆ పేరుతోనే… హీరోయిన్ బాగా హైలెట్ అవుతుంది. ఉదాహరణకి చూసుకుంటే… ‘బొమ్మరిల్లు’ చిత్రంలో హాసిని గా జెనీలియా బాగా పాపులర్ అయ్యింది. అలాగే ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ చిత్రంలో సీత పాత్రతో బాగా పేరుతెచ్చుకుంది అంజలి. ఇటీవల ఆ లిస్టులో చేరింది కీర్తి సురేష్. హీరోయిన్ గా తక్కువ సినిమాలే చేసినప్పటికీ స్టార్ హోదా దక్కించుకుంది కీర్తి సురేష్. ‘మహానటి’ సినిమాతో ఆమె క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. తెలుగు, తమిళ భాషల్లో అగ్ర హీరోలతో జత కడుతూ బిజీ హీరోయిన్ గా మారిపోయింది. ప్రస్తుతం కీర్తి సురేష్ అనడం కంటే ‘మహానటి’ గానే ఎక్కువ పాపులర్ అయ్యింది.
ఇక ‘మహానటి’ సక్సెస్‌తో తన రూట్ పూర్తిగా మార్చేసింది కీర్తి. ఈ చిత్రానికి ముందు చిన్న హీరోలూ… పెద్ద హీరోలూ.. అని చూడకుండా కీర్తి అందరి హీరోలతోనూ నటించేది. అయితే ప్రస్తుతం పెద్ద హీరోలతో మాత్రమే సినిమాలు చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తుందట. చిన్న హీరోలంటే కథ నచ్చలేదని, కాల్ షీట్లు కాళీ లేవని చెప్పి తప్పించుకుంటోందట. పెద్ద హీరో అయితే కథ కూడా పట్టించుకోకుండా ఓకే చెప్పేస్తుందని టాక్ వినిపిస్తుంది. ఒక హీరోయిన్ స్టార్ గా ఎదిగిన తరువాత ఇలా ప్రవర్తించడం మామూలే అని కొందరు అంటున్నప్పటికీ… ఎంత స్టార్ హీరోయిన్ అయినా 5 ఏళ్ళకు మించి క్రేజ్ ఉండే అవకాశం లేదని.. అందుకు తగినట్టుగా నడుచుకోవాలని ఫిలింనగర్లో చర్చించుకుంటున్నారు.