Keerthy Suresh: గుర్తుపట్టలేని విధంగా కీర్తి సురేష్.. వైరల్ అవుతున్న ఫోటో..!

దివంగత స్టార్ హీరోయిన్ సావిత్రి గారి జీవిత కథతో రూపొందిన ‘మహానటి’ చిత్రంతో ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ అయిపోయింది కీర్తి సురేష్. ఆ చిత్రంలో కీర్తి నటించింది అనేకంటే.. నిజంగానే సావిత్రి గారు నటిస్తున్నారా అనేంతలా ఆశ్చర్యపరిచింది. సావిత్రి గారి సినిమాలు కీర్తి సురేష్ ఎన్ని చూసిందో తెలీదు కానీ.. నిజజీవితంలో ఆమె హావభావాలు ఎలా ఉంటాయో.. అదే విధంగా పెర్ఫార్మ్ చేసింది అని అప్పటి నటీనటులు కూడా కామెంట్లు చేశారు.

అంతకుముందు నేను శైలజ, నేను లోకల్, అజ్ఞాతవాసి వంటి చిత్రాల్లో కీర్తి సురేష్ నటించినప్పటికీ.. ‘మహానటి’ చిత్రంతోనే కీర్తికి మంచి బ్రేక్ వచ్చింది. ఈ చిత్రంలో కీర్తి సురేష్ నటనకు గాను నేషనల్ అవార్డు కూడా దక్కడం విశేషం. ప్రస్తుతం కీర్తి.. చేతినిండా సినిమాలతో బిజీగా గడుపుతుంది. ఈ విషయాలను పక్కన పెట్టేస్తే.. కీర్తి సురేష్ రేర్ పిక్ ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. అలా అని ఇది గ్లామర్ పిక్ అనుకుంటే పొరపాటే..!కీర్తి సురేష్ ఈ ఫొటోలో డీ గ్లామరస్ గా కనిపిస్తుంది.

‘మేకప్ లెస్’ పిక్ అని కొందరు అంటున్నప్పటికీ.. ఇది కీర్తి సురేష్ లేటెస్ట్ పిక్ లా లేదు. బహుశా ఈమె సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వకముందు తీసిన ఫోటో అయ్యి ఉంటుంది అని కొందరు కామెంట్లు పెడుతున్నారు. మరికొందరు అయితే కీర్తి సురేష్ కాలేజీ రోజుల్లో తీసిన ఫోటో అయ్యి ఉంటుంది అని అభిప్రాయపడుతున్నారు. ఇక సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం కీర్తి.. మహేష్ బాబు ‘సర్కారు వారి పాట’ సినిమాలో నటిస్తుంది.

Most Recommended Video

2020 Rewind: ఈ ఏడాది సమ్మోహనపరిచిన సుమధుర గీతాలు!
కొన్ని లాభాల్లోకి తీసుకెళితే.. మరికొన్ని బోల్తా కొట్టించాయి!
2020 Rewind: ఈ ఏడాది డిజాస్టర్ సినిమాలు ఇవే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus