బుల్లితెర ప్రేక్షకులకి ‘జబర్దస్త్’ కమెడియన్ కెవ్వు కార్తీక్ అందరికీ సుపరిచితమే. మిమిక్రీ ఆర్టిస్ట్ గా కెరీర్ ను ప్రారంభించిన కార్తీక్ ‘జబర్దస్త్’ షో ద్వారా మంచి గుర్తింపు పొందాడు. ఈ షోలో అతను వేసిన స్కిట్స్ కొన్ని బాగా పేలాయి. దీంతో అతనికి సినిమాల్లో కూడా అవకాశాలు బాగానే వచ్చాయి. చిన్న చిన్న పాత్రల్లో అతను చిన్న, మిడ్ రేంజ్ సినిమాల్లో కనిపిస్తూనే ఉన్నాడు. 2023 జూన్ లో ఇతను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. అటు తర్వాత శ్రీలేఖ అనే అమ్మాయిని ఇతను పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకున్నాడు.
ఆ తర్వాత అంటే 2024 లో ఇతనికి పెద్ద షాక్ తగిలింది. కార్తీక్ తల్లి క్యాన్సర్ తో మరణించారు. దీంతో అతను డిప్రెషన్ కి లోనయ్యాడు. ఆ తర్వాత ఇతను ఎమోషనల్ గా బాగా డిస్టర్బ్ అయ్యాడు. అయితే ఇప్పుడు బాగానే కోలుకున్నాడు. తాజాగా ఇతను తన భార్య శ్రీలేఖతో కలిసి ఓ గుడిలో కనిపించాడు.స్వర్ణగిరి ఆలయంలో ఈ దంపతులు కలిసి దర్శనమిచ్చారు. ట్రెడిషనల్ వేర్ లో ఈ దంపతులు సాంప్రదాయ పద్ధతిలో కనిపిస్తున్నారు.
కార్తీక్ భార్యతో పాటు ఆమె ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈ ఆలయానికి వచ్చినట్టు స్పష్టమవుతుంది. ఇక్కడ తీసుకున్న బ్యూటిఫుల్ మూమెంట్స్ కి సంబంధించిన ఫోటోలు తమ సోషల్ మీడియాలో షేర్ చేయగా.. వాటికీ ‘సింప్లీ సూపర్’ అంటూ నెటిజన్లు స్పందిస్తున్నారు. ఆ ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. మీరు కూడా ఓ లుక్కేయండి: