2018 వ సంవత్సరం చివర్లో వచ్చిన ‘కె.జి.ఎఫ్ చాప్టర్ 1’ మూవీ ఎంత పెద్ద సక్సెస్ సాధించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆ మూవీకి సీక్వెల్ గా తెరకెక్కింది ‘కె.జి.ఎఫ్ చాప్టర్ 2’. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ ఏప్రిల్ 14న విడుదల అయ్యి సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. రాకింగ్ స్టార్ యష్ హీరోయిజం, దర్శకుడు ప్రశాంత్ నీల్ మాస్ టేకింగ్ ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంది.
టీజర్, ట్రైలర్ లకి తగ్గట్టుగానే సినిమా కూడా ఉండడంతో ‘కె.జి.ఎఫ్ 2’ కి మాస్ ఓపెనింగ్స్ నమోదయ్యాయి.8 వ రోజున కూడా ఈ మూవీ కోటి పైనే షేర్ ను రాబట్టి ఆశ్చర్యపరిచింది.
ఒకసారి ‘కె.జి.ఎఫ్ 2’ 8 డేస్ కలెక్షన్స్ ను గమనిస్తే :
నైజాం | 34.85 cr |
సీడెడ్ | 9.24 cr |
ఉత్తరాంధ్ర | 6.12 cr |
ఈస్ట్ | 4.52 cr |
వెస్ట్ | 2.74 cr |
గుంటూరు | 3.63 cr |
కృష్ణా | 3.32 cr |
నెల్లూరు | 2.13 cr |
ఏపీ + తెలంగాణ (టోటల్) | 66.15 cr |
‘కె.జి.ఎఫ్2’ చిత్రానికి రూ.74 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.75 కోట్ల వరకు షేర్ ను రాబట్టాల్సి ఉంది. 8 రోజులు పూర్తయ్యేసరికి ఈ చిత్రం రూ.66.15 కోట్ల షేర్ ను రాబట్టింది. ఓ డబ్బింగ్ సినిమా ఇంత కలెక్ట్ చేయడం అంటే మామూలు విషయం కాదు. గతంలో ఈ రికార్డ్ ‘2.o’ పేరుతో ఉండేది. అయితే ‘కె.జి.ఎఫ్2’ తెలుగులో బ్రేక్ ఈవెన్ కావాలంటే మరో రూ.8.85 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది.
రెండో వీకెండ్ కు పోటీగా పెద్ద సినిమాలు ఏమీ లేవు. కనీసం మినిమమ్ బజ్ ఉన్న సినిమాలు కూడా లేవు కాబట్టి.. ‘కె.జి.ఎఫ్2’ కి కలిసొచ్చే అవకాశం.మరి ఈ వీకెండ్ తో ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కు చేరువవుతుందేమో చూడాలి..!
Most Recommended Video
‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
తెలుగులో అత్యధిక థియేట్రికల్ బిజినెస్ చేసిన సినిమాల లిస్ట్..!
‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు బాక్సాఫీస్ వద్ద భారీ లాభాలను అందించిన 10 సినిమాల లిస్ట్..!