KGF2 Trailer: ‘కేజీఎఫ్ చాప్టర్ 2’ ట్రైలర్ రిలీజ్ ఎప్పుడంటే..?

కన్నడ స్టార్ హీరో యష్ నటించిన ‘కేజీఎఫ్2’ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు అభిమానులు. దర్శకుడు ప్రశాంత్ నీల్ పాన్ ఇండియా లెవెల్ లో ఈ సినిమాను రూపొందించారు. ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబలే ఫిలిమ్స్ ఈ సినిమాను నిర్మించింది. ‘కేజీఎఫ్1’ సినిమా పాన్ ఇండియా రేంజ్ లో సెన్సేషనల్ హిట్ అయిన సంగతి తెలిసిందే. దీంతో కేజీఎఫ్ 2 సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఏప్రిల్ 14న తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో సినిమాను విడుదల చేయనున్నారు.

తాజాగా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ కి సంబంధించిన అప్డేట్ ను వెల్లడించింది చిత్రబృందం. ఈ సినిమా ట్రైలర్ ను మార్చి 27న సాయంత్రం 6 గంటల 40 నిమిషాలకు విడుదల చేయబోతున్నట్లు అనౌన్స్ చేశారు. కొన్నాళ్లక్రితం ఈ సినిమా టీజర్ విడుదలైనప్పుడు యూట్యూబ్ లో రికార్డులు సాధించింది. దీంతో ఇప్పుడు ట్రైలర్ ఎలా ఉండబోతుందోనని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్. ఈ సినిమాలో యష్ కి జోడీగా శ్రీనిధి శెట్టి నటిస్తోంది.

మెయిన్ విలన్ పాత్రలో సంజయ్ దత్ కనిపించనున్నారు. మరో కీలకపాత్రలో రవీనా టాండ‌న్‌ కనిపించనుంది. అలానే ప్రకాష్ రాజ్, రావు రమేష్ లాంటి తారలు కీలకపాత్రలు పోషించారు. ఇక ఈ సినిమా ట్రైలర్ కొత్త రికార్డులను సృష్టిస్తుందని నమ్మకంగా చెబుతున్నారు ఫ్యాన్స్. ఈసారి రాకీ భాయ్ గా యష్ తన నట విశ్వరూపం చూపించడం ఖాయం. ఫస్ట్ పార్ట్ రాకీ.. విలన్ ను చంపడంతో ఎండ్ అవుతుంది. అక్కడ నుంచే సెకండ్ పార్ట్ మొదలుకానుంది. దేశవ్యాప్తంగా ఈ సినిమా భారీ విజయాన్ని అందుకోవడం ఖాయం..!

బిగ్ బాస్ నాన్ స్టాప్ 17మంది కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!

Most Recommended Video

‘భీమ్లా నాయక్’ లోని అదిరిపోయే డైలాగులు ఇవే..!
సెలబ్రిటీ కపుల్స్ నయా ట్రెండ్.. ‘సరోగసీ’..!
చైసామ్, ధనుష్- ఐస్ లు మాత్రమే కాదు సెలబ్రిటీల విడాకుల లిస్ట్ ఇంకా ఉంది..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus